Rashmika Mandanna Open About Varasudu Movie Character - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: నా పాత్ర అంతే అని తెలుసు.. అయినా ఒప్పుకున్నా: రష్మిక

Published Sat, Jan 21 2023 7:40 PM | Last Updated on Sat, Jan 21 2023 8:20 PM

Rashmika Mandanna Open About Varasudu Movie Character - Sakshi

తమిళ స్టార్ హీరో విజయ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం వారసుడు(వారిసు). వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించారు. సంక్రాంతి కానుకగా తెరపైకి వచ్చిన ఈ సినిమా తెలుగులో జనవరి 14న రిలీజైంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో నేషనల్ క్రష్‌ రష్మిక పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం హాట్‌ టాపిక్‌గా మారింది. టాప్ హీరోయిన్‌ను ఈ చిత్రంలో కేవలం పాటలకే పరిమితం చేయడంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 

అయితే తాజాగా ఆమె వారసుడు సినిమాలో తన పాత్రపై తొలిసారి స్పందించింది. ప్రాధాన్యత లేకపోయినా కేవలం విజయ్ కోసమే ఈ సినిమా ఒప్పుకున్నట్లు తెలిపింది పుష్ప బ్యూటీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చింది భామ. 

రష్మిక మాట్లాడుతూ..'తన పాత్రకు స్కోప్‌ లేకపోయినా నటించా.అవును ఇది నా సొంత నిర్ణయం. నా ఇష్ట ప్రకారమే  ఒప్పుకున్నా. విజయ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలనే వారసుడులో నటించా. ఇందులో నా పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని తెలుసు. రెండు పాటల కోసమేనని నాకు తెలుసు. ఈ విషయాన్ని సినిమా షూట్‌లో ఉన్నప్పుడు విజయ్‌కి సరదాగా చెప్పేదాన్ని. ఈ సినిమాలో నాకు పాటలు తప్ప ఏమీ లేవు అంటూ జోక్స్‌ వేసేదాన్ని. ఆయన కొన్ని విషయాలను కూడా నేర్చుకున్నా. అని అన్నారు. ఈ చిత్రంలో రష్మిత జిమిక్కి పొన్ను, రంజితమే పాటల్ తన డ్యాన్స్‌తో రష్మిక అదరగొట్టింది. 

ప్రస్తుతం రష్మిక  సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మూవీ ‘మిషన్‌ మజ్ను’ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. దీంతో పాటు రణ్‌బీర్‌ కపూర్‌, సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘యానిమల్‌’, అల్లు అర్జున్ పుష్ప-2 లో కనిపంచనుంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement