Thalapathy Vijay's Varasudu, Varisu Movie Locks OTT Partner - Sakshi
Sakshi News home page

Varasudu OTT Partner: విజయ్‌ వారసుడు ఓటీటీ పార్ట్‌నర్‌ లాక్‌! అంతకు ముందే స్ట్రీమింగ్‌? ఎప్పుడంటే..

Published Mon, Jan 16 2023 2:04 PM | Last Updated on Mon, Jan 16 2023 3:27 PM

Vijay Varasudu, Varisu Movie Locks This OTT Partner - Sakshi

తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ వారసుడు(తమిళంలో వారీసు) సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందే వివాదంగా మారిన ఈ మూవీ తమిళంలో జనవరి 11న, తెలుగులో జనవరి 14న థియేటర్లోకి వచ్చింది. డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి పూర్తి స్థాయిలో తెరకెక్కించిన ఈ తమిళ చిత్రానికి టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్‌ రాజు నిర్మాత వ్యవహరించారు. తాజాగా ఈ మూవీ రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరడం విశేషం. 

చదవండి: చిరంజీవి మెసేజ్‌లను అవాయిడ్‌ చేసిన స్టార్‌ యాంకర్‌! అసలేం జరిగిందంటే..

తెలుగులో వారసుడు టాక్‌ అంతంతగానే ఉన్నప్పటిక తమిళ ప్రేక్షకులను ఈ మూవీ విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో వసూళ్ల పరంగా దేశవ్యాప్తంగా ఈ సినిమా దూకూడు చూపిస్తోంది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఫలితంగా వారసుడు మంచి విజయం సాధించింది. థియేటర్లో సందడి చేస్తున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తిని సంతరించుకుంది. తాజా బజ్‌ ప్రకారం.. వారసుడు(వారీసు) మూవీ డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైం వీడియోస్‌ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.  

చదవండి: తండ్రి ఎమోషనల్‌.. ఇది నాకు అతిపెద్ద విజయం: డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి

సాధారణంగా స్టార్‌ మీరో మూవీ థియేట్రికర్‌ రన్‌ అనంతరం 8 వారాలు అంటే రెండు నెలల తర్వాతే ఓటీటీకి వస్తుంది. ఇక విజయ్‌ వారసుడు మాత్రం అంతకు ముందే స్ట్రీమింగ్‌ కానుందని సమాచారం. అంటే 4 నుంచి 6 వారాలకు వారసుడు మూవీ అమెజాన్‌లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. త్వరలోనే స్ట్రీమింగ్‌ తేదీ, రిలీజ్‌పై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. కాగా ఈ సినిమాలో విజయ్‌ సరసన రష్మిక నటించింది. శరత్‌ కుమార్‌, జయసుధ, శ్రీకాంత్‌, శ్యామ్‌లు ప్రధాన పాత్రలు పోషించగా.. ప్రకాశ్‌ రాజ్‌ ప్రతికథానాయకుడిగా కనిపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement