
తమిళ స్టార్ హీరో విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'వారీసు'. తెలుగులో ఈ సినిమా వారసుడుగా రిలీజ్ చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన రష్మిక, విజయ్‌ల ఫస్ట్ లుక్ విపరీతంగా ఆకర్షిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ వచ్చేసింది. తమిళ వర్షన్‌లో విడుదలైన ఈ సాంగ్ అభిమానులను ఊర్రూతలూగిస్తోంది.
(చదవండి: విజయ్, రష్మికల ‘వారీసు’ మూవీ ఎలా ఉంటుందంటే)
తెలుగు, తమిళ భాషల్లో విజయ్ ఏకకాలంలో నటిస్తున్న చిత్రం వారీసు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, ప్రభు, ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సంగీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటివరకు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విజయ్ ఈ మూవీతో నేరుగా పలకరించబోతున్నాడు. ఈ చిత్రం కుటుంబ సెంటిమెంట్‌తో కూడిన యాక్షన్, రొమాన్స్ కథా చిత్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment