'గ్రౌండ్‌లో ఎంతమంది ఉన్నా.. చూసేది ఆ ఒక్కడినే'.. వారసుడు ట్రైలర్ | Tamil Star Hero Vijay Vaarasudu Movie Telugu Trailer Out Today | Sakshi
Sakshi News home page

Vaarasudu Movie Trailer: విజయ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. యూట్యూబ్‌ షేక్ చేస్తున్న వారసుడు ట్రైలర్

Published Wed, Jan 4 2023 7:00 PM | Last Updated on Wed, Jan 4 2023 7:12 PM

Tamil Star Hero Vijay Varisu Movie Telugu Trailer Out Today - Sakshi

తమిళ స్టార్‌ హీరో విజయ్‌, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా తెరకెక్కించిన చిత్రం 'వారిసు'.  తెలుగులో  ఈ సినిమా వారసుడుగా రిలీజ్ చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానుంది. తాజాగా తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తుండగా.. తమన్‌ సంగీతమందించారు.

ఈ చిత్రంలో శరత్‌కుమార్, ప్రభు, ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సంగీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటివరకు డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విజయ్ ఈ మూవీతో నేరుగా పలకరించబోతున్నాడు. ఈ చిత్రం కుటుంబ సెంటిమెంట్‌తో కూడిన యాక్షన్, రొమాన్స్‌ కథా చిత్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement