విజయ్‌ 69వ చిత్రంలో మలయాళ బ్యూటీ? | Thalapathy 69 movie acting actress mamitha Baiju confirm Vijay | Sakshi
Sakshi News home page

విజయ్‌ 69వ చిత్రంలో మలయాళ బ్యూటీ?

Published Tue, Aug 6 2024 12:47 PM | Last Updated on Tue, Aug 6 2024 12:47 PM

Thalapathy 69 movie acting actress mamitha Baiju confirm Vijay

నటుడు విజయ్‌ కథానాయకుడిగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం గోట్‌. ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్రాన్ని సెపె్టంబర్‌ 5న తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో విజయ్‌ తన 69వ చిత్రంపై దృష్టి పెడుతున్నారు. సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్‌కి ఇదే చివరి చిత్రం అనే ప్రచారం చాలాకాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. 

దీంతో ఈ చిత్రం తన రాజకీయ జీవితానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలని ఆయన భావించినట్లు సమాచారం. కాగా దర్శకుడు హెచ్‌.వినోద్‌ నటుడు కమలహాసన్‌ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. అందుకు కథను కూడా తయారు చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం డ్రాప్‌ అయ్యిందని తెలిసింది. అయితే అదే కథతో విజయ్‌ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించడానికి హెచ్‌.వినోద్‌ రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. 

ఈ కథ సమకాలీన రాజకీయలు ఇతి వృత్తంగా ఉంటుందని, అందుకే విజయ్‌ ఈ చిత్రం చేయడానికి అంగీకరించినట్లు టాక్‌. ఏదేమైనా ఈ చిత్రానికి సంధించిన ఫ్రీ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలను దర్శకుడు హెచ్‌.వినోద్‌ ప్రారంభించారనీ నవంబర్‌లో ఈ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రంలో లుక్‌ కోసం నటుడు విజయ్‌తో ఇటీవల ఫొటో సెషన్‌ చేసినట్లు తెలిసింది. దీంతో ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

 కాగా ఇందులో సంచలన నటి సమంత ప్రధాన పాత్రను పోషించనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా మలయాళ కుట్టి మమితా బైజూ ఇందులో విజయ్‌తో కలిసి నటించనున్నారనే టాక్‌ వైరల్‌ అవుతోంది. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ కేరళ కుట్టి ప్రేమలు అనే మలయాళ చిత్రం ద్వారా బాగా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. కాగా విజయ్‌ సరసన నటించే అవకాశం వచ్చిందంటే నిజంగా ఆమె లక్కే అని చెప్పాలి. కాగా కేవీఎన్‌ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతాన్ని, సత్యన్‌ సూర్యన్‌ ఛాయాగ్రహణం అందించనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement