
పొంగల్‌కు విడుదలవుతున్న వారీసు, తుణివు చిత్రాలకు తమిళనాడు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఈ రెండు చిత్రాలు బుధవారం తెరపైకి రానున్నాయి. దీంతో థియేటర్ల యాజమాన్యం స్పెషల్ షోలకు అనుమతి కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. కాగా అజిత్ నటించిన తుణివు చిత్రం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఆటల ప్రదర్శనకు, విజయ్ చిత్రం వారీసు తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రత్యేక ఆటల ప్రదర్శనలకు ఏర్పాటు చేసుకున్నారు.
అయితే ఈ చిత్రాలకు ప్రభుత్వం 11, 12 తేదీల వరకే స్పెషల్ షోలకు అనుమతిని ఇచ్చింది. ఆ తరువాత పండుగ సందర్భంగా 13 నుంచి 16వ తేదీ వరకు ఎలాంటి ప్రత్యేక ఆటలకు అనుమతి లేదని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా థియేటర్ల ముందు భారీ కటౌట్లును ఏర్పాటు చేయడం, పాలాభిõÙకాలు చేపట్టడాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రూ.7 లక్షలతో అజిత్ కటౌట్
తమ అభిమాన నటులను ఆరాధించడం సహజమే. కర్ణాటకకు చెందిన నటుడు అజిత్ అభిమాని ఒకరు భారీ ఎత్తున తుణివు చిత్రంలోని కటౌట్‌ను ఏర్పాటు చేశాడు. ఈ కటౌట్ కోసం అతను అక్షరాల రూ.7 లక్షలు వెచ్చించాడు. ఇప్పుడు ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment