ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది.. దిల్‌ రాజు | Varisu Movie: Thanksgiving Meet Held In Chennai | Sakshi
Sakshi News home page

Dil Raju: తారక్‌, ప్రభాస్‌, మహేశ్‌బాబుతో చేశా.. ఇన్నాళ్లకు విజయ్‌తో..

Published Tue, Jan 17 2023 10:51 AM | Last Updated on Tue, Jan 17 2023 11:13 AM

Varisu Movie: Thanksgiving Meet Held In Chennai - Sakshi

దళపతి విజయ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించాడు. ఈ నెల 11వ తేదీన తెరపైకి వచ్చిన ఈ సినిమా తెలుగులో వారసుడు పేరుతో 14న విడుదలైంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లపర్వం సాగిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ సోమవారం మధ్యాహ్నం చెన్నైలో థ్యాంక్స్‌ గివింగ్‌ మీట్‌ నిర్వహించింది.

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. వారిసు సినిమా విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమా చూసి పలువురు సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. ప్రసాద్‌ ల్యాబ్‌ అధినేత రమేష్‌ ప్రసాద్‌ హైదరాబాద్‌లో చిత్రం చూసి మంచి సినిమా తీశారని ప్రశంసిస్తూ మెసేజ్‌ పెట్టారు అని చెప్పుకొచ్చాడు. నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ.. విజయ్‌ నటించిన పూవే ఉనక్కాగా, కాదలక్కు మర్యాదై, తీళ్లాద మనం తుళ్లుమ్‌.. ఇలా కొన్ని సినిమాలు చాలా ఇష్టం. ఇటీవల ఆయన కమర్షియల్‌ ఫార్మాట్‌ చిత్రాలే చేస్తున్నారని అనిపించింది. తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ కమర్షియల్‌ చిత్రాలు చేస్తున్న సమయంలో బృందావనం వంటి ఫ్యామిలీ మూవీ చేశాను. అదేవిధంగా ప్రభాస్‌తో మిస్టర్‌ పర్ఫెక్ట్, మహేశ్‌బాబుతో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలను చేశాను. అలాంటి ఎమోషనల్‌ ఫ్యామిలీ నేపథ్యంలో విజయ్‌ హీరోగా సినిమా చేస్తే బాగుండు అనుకున్నాను. ఆ కోరిక వల్లే వంశీ పైడిపల్లి చెప్పిన ఈ సినిమా కథను వెంటనే ఓకే చేశాను' అన్నాడు.

చదవండి: ప్రియమణి కొటేషన్‌ గ్యాంగ్‌ టీజర్‌ చూశారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement