డాక్టర్ కఫీల్ ఖాన్(ఫైట్ ఫోటో)
లక్నో: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) లో పౌరసత్వ సవరణ చట్టం అంశంపై 2019 లో డాక్టర్ కఫీల్ ఖాన్ చేసిన ఉద్వేగభరితమైన ప్రసంగానికి సంబంధించిన కేసులో అలహబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సాంకేతిక కారణాలతో అతడిపై నమోదైన క్రిమినల్ కేసులను పక్కన పెట్టింది. అలీగఢ్ మేజిస్ట్రేట్ ముందు ఛార్జిషీట్ దాఖలు చేయడానికి ముందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తప్పనిసరి ముందస్తు అనుమతిని పోలీసులు తీసుకోలేదని డాక్టర్ ఖాన్ చేసిన విజ్ఞప్తిని జస్టిస్ గౌతమ్ చౌదరి అంగీకరించారు. ఈ కేసులో ఇప్పుడు సరైన విధానాన్ని అనుసరించమని కోరుతూ న్యాయమూర్తి కేసును తిరిగి స్థానిక కోర్టుకు పంపారు.
ఈ సందర్భంగా3 డాక్టర్ కఫీల్ ఖాన్ మాట్లడుతూ.. ‘‘ఇది భారతదేశ ప్రజలు సాధించిన భారీ విజయం. ఈ తీర్పు న్యాయవ్యవస్థ మీద నమ్మకాన్ని పెంచింది. అలహాబాద్ హైకోర్టు తీర్పుతో ఉత్తరప్రదేశ్ ప్రజలపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ ఉన్నతాధికారం పూర్తిగా బహిర్గతమైంది. ఈ ధైర్యమైన తీర్పు భారతదేశం అంతటా జైళ్లలో మగ్గుతున్న ప్రజాస్వామ్య అనుకూల పౌరులు, కార్యకర్తలందరికీ నమ్మకాన్ని, ఆశను ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. భారత ప్రజాస్వామ్యం దీర్ఘకాలం వర్థిల్లాలి’’ అంటూ నినాదాల చేశారు. (చదవండి: పౌర స్వేచ్ఛకు పట్టం)
డాక్టర్ కఫీల్ ఖాన్ తన డిసెంబర్ 13, 2019 పౌరసత్వ సవరణ చట్టం అంశంపై తన ప్రసంగం ద్వారా ఏఎంయూ యొక్క శాంతియుత వాతావరణాన్ని, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో అతడిపై కేసు నమోదు చేశారు. అంతేకాక అతను మతం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించాడని కఫీల్ ఖాన్‌పై అభియోగాలు మోపారు. ఈ క్రమంలో కఫీల్‌ని జనవరి 29, 2020 న అరెస్టు చేశారు. తర్వాత, ఈ కేసులో జాతీయ భద్రతా చట్టం అమలులోకి వచ్చింది. (చదవండి: వివాహేతర సంబంధం: డీఎన్‌ఏ పరీక్ష ఉత్తమం)
పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగించడం.. భారతదేశ భద్రతకు.. విదేశీ దేశాలతో దాని సంబంధాలకు భంగం కలిగించారని అనుమానించినట్లయితే, ఒక సంవత్సరం వరకు కోర్టులో ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రజలను నిర్బంధించడానికి ఈ కఠినమైన చట్టం ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. గత సెప్టెంబర్‌లో, అలహాబాద్ హైకోర్టు డాక్టర్ ఖాన్‌ను సుదీర్ఘంగా నిర్బంధించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. అతడిని వెంటనే బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. అయితే, భారతీయ శిక్షాస్మృతి కింద క్రిమినల్ చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment