జడ్జీలుగా ప్రమాణం చేసిన జస్టిస్ నాగప్పన్, శివ కీర్తిలు | Justice Nagappan, Justice S.K. Singh sworn in as SC judges | Sakshi
Sakshi News home page

జడ్జీలుగా ప్రమాణం చేసిన జస్టిస్ నాగప్పన్, శివ కీర్తిలు

Published Thu, Sep 19 2013 11:32 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM

Justice Nagappan, Justice S.K. Singh sworn in as SC judges

జస్టిస్ సీ.నాగప్పన్, జస్టిస్ శివ కీర్తి సింగ్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ.సదాశివం వారిద్దరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళనాడుకు చెందిన జస్టిస్ సీ.నాగప్పన్ ఇప్పటి వరకు ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, బీహార్కు చెందిన జస్టిస్ శివ కీర్తి సింగ్ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తించారు. వారిద్దరి నియామాకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement