P. Sathasivam
-
'నా నియామకంపై వివాదం లేదు'
తిరువనంతపురం: కేరళ గవర్నర్ గా తనను నియమించడం పట్ల ఎటువంటి వివాదం లేదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పళనిస్వామి సదాశివం అన్నారు. తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు నియామకం జరిగివుంటే ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సివుండేదని, కానీ తాను పదవీవిరమణ చేసి కొన్ని నెలలు గడిచినందునా వివాదం లేదని ఆయన వివరించారు. తాను ఎటువంటి వ్యాపారాలు చేయబోనని, కార్పొరేట్ సంస్థలకు సలహాలు అందించబోనని పదవీ విరమణ రోజే చెప్పానని అన్నారు. కేరళ గవర్నర్ గా సదాశివంను కేంద్ర ప్రభుత్వం నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ, కేరళ ప్రభుత్వం తప్పుబట్టిన నేపథ్యంలో ఆయనీ వివరణయిచ్చారు. -
'ప్రభుత్వ పదవులకు దూరంగా ఉండటమే మంచిది'
తిరువనంతపురం: పదవీవిరమణ అనంతరం సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు జ్యూడీషియల్ ఇంక్వైరీ కమిషన్ మినహా అన్ని పదవులకు రెండేళ్ల పాటు స్వచ్ఛందంగా దూరంగా ఉండడం మంచిదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కేటీ థామస్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివం కేరళ గవర్నర్‌గా రానున్నారంటూ వార్తలు వస్తుండటంపై సోమవారం థామస్ పై విధంగా స్పందించారు. ఆరు సంవత్సరాల పాటు సుప్రీం న్యాయమూర్తిగా సేవలందించిన థామస్.. 2002 లో పదవీ విరమణ పొందారు. రాజీనామా చేసిన న్యాయమూర్తులు ప్రభుత్వ పదవులకు దూరంగా ఉండాలన్న నియమనిబంధనలు ఏమీ లేకపోయినా.. ఇది తన అభిప్రాయంగా పేర్కొన్నారు. ప్రజలు ఎప్పుడూ న్యాయవ్యవస్థను నిశితంగా గమనిస్తూ ఉంటారని.. వారికి ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇచ్చే పదవులకు దూరంగా ఉండటమే మంచిదని తెలిపారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివంను కేరళ గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించబోతోందన్న అంశంపై రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చ మొదలైంది. దేశ అత్యున్నత న్యాయ పదవిని అలంకరించిన ఓ వ్యక్తికి గవర్నర్‌గా అధికారాలు అప్పగిస్తే అది అనూహ్య పరిణామమే అవుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. -
పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే!
కేసు నమోదు చేయాలని ఫిర్యాదుదారుడు కోరితే తప్పనిసరిగా ప్రాథమిక సమాచార నివేదిక(ఎఫ్ఐఆర్) ను పోలీసులు నమోదు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మంగళవారం తన తీర్పులో వెల్లడించింది. కేసు నమోదు చేయడానికి ఏ పోలీస్ ఆఫీసర్ సమ్మతించకపోతే తీవ్రమైన చర్యలు తీసుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి పి సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. చట్ట ప్రకారం కేసు నమోదుకు అర్హత ఉన్న ప్రతి నేరంపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేయాలని బెంచ్ తో మాట్లాడుతూ సదాశివం అన్నారు. మూడేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడే నేరాలకు సంబంధించిన విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. -
జడ్జీలుగా ప్రమాణం చేసిన జస్టిస్ నాగప్పన్, శివ కీర్తిలు
జస్టిస్ సీ.నాగప్పన్, జస్టిస్ శివ కీర్తి సింగ్‌లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ.సదాశివం వారిద్దరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళనాడుకు చెందిన జస్టిస్ సీ.నాగప్పన్ ఇప్పటి వరకు ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, బీహార్‌కు చెందిన జస్టిస్ శివ కీర్తి సింగ్ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తించారు. వారిద్దరి నియామాకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరుకుంది. -
కొలీజియం వ్యవస్థ సరైనదే: సీజేఐ
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం వ్యవస్థ సరైనదేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం సమర్థించారు. అయితే, దీనిని మార్చేందుకు బిల్లును తెచ్చే అధికారం కేంద్రానికి ఉందన్నారు. బిల్లులోని అంశాలపైన, దానిని ఆమోదించిన తీరుపైన తానేమీ వ్యాఖ్యలు చేయబోవడం లేదని, బిల్లును తెచ్చే అధికారం కేంద్రానికి ఉందని, దానిని అంగీకరించాలా లేదా తిరస్కరించాలా అనేది ప్రజలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. న్యాయ పరిపాలనపై శనివారం ఢిల్లీలో ఏర్పాటైన సదస్సును ప్రారంభించిన సందర్భంగా జస్టిస్ సదాశివం మాట్లాడారు. -
రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారు?
సాక్షి లీగల్ కరస్పాండెంట్, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుచేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్నిసవాలు చేస్తూ సుప్రీంకోర్టులో గురువారం ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది పి.వి. కృష్ణయ్య దాఖలుచేసిన ఈ పిటిషన్‌ను ఈనెల 26న విచారించనున్నట్లు చీఫ్ జస్టిస్ పి. సదాశివం, జస్టిస్ రంజనా దేశాయ్, జస్టిస్ రంజన్ గొగైలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని, తెలంగాణరాష్ర్టం ఏర్పాటుకు తదుపరి చర్యలు తీసుకోకుండా కేంద్రాన్ని నిరోధించాలని పిటిషనర్ కోరారు. ఆంధ్రా ప్రాంతం, హైదరాబాద్ రాష్ర్టంలో ఒకభాగం, తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడిందని, ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనను 1969, 1972లలో తిరస్కరించారని ఆ రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రాంతీయ అసమానతలను తొలగించే ఉద్దేశంతో విద్య, ఉద్యోగాలలో స్థానిక రిజర్వేషన్లు కల్పిస్తూ 1973లో రాజ్యాంగాన్ని సవరించారని, ఆర్టికల్ 371డిని చేర్చారని పిటిషన్లో వివరించారు. ఇపుడు రాష్ట్రాన్ని విడగొట్టడం వల్ల రాజ్యాంగంలోని 371డి కింద లభిస్తున్న స్థానిక రిజర్వేషన్ హక్కులు కోల్పోతారని, తర్వాత వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వృథాగా మారుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు తమ స్వార్థం కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంచేశారని, తెలంగాణ రాష్ర్టం ప్రకటించడంతో విభజనను వ్యతిరేకిస్తూ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలోని ప్రజలు ఉద్యమిస్తున్నారని, పాలనను స్తంభింపజేస్తున్నారని పిటిషన్లో వివరించారు. హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా చేస్తారన్న ప్రకటనతో సీమాంధ్ర ప్రజలలో అభద్రతాభావం, అసహనం పెరిగిపోయాయని, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమ్మెను ప్రారంభించారని పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయ వత్తిళ్లకు లొంగి ఎస్సార్సీ నియమించకుండానే ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టడానికి చర్యలు తీసుకోవడం చట్టసమ్మతమేనా అని పిటిషనర్ ప్రశ్నించారు. మాయావతి సీఎంగా ఉండగా ఉత్తరప్రదేశ్‌ను విడగొట్టడానికి అసెంబ్లీ చేసిన తీర్మానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని, అలాగే దేశంలో బోడోలాండ్, గూర్ఖాలాండ్, మరఠ్వాడా వంటి అనేక డిమాండ్లున్నా పట్టించుకోకపోవడాన్ని కేంద్రం ఎలా సమర్థించుకుంటుందని పిటిషనర్ ప్రశ్నించారు. సాక్షి లీగల్ కరస్పాండెంట్, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుచేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్నిసవాలు చేస్తూ సుప్రీంకోర్టులో గురువారం ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది పి.వి. కృష్ణయ్య దాఖలుచేసిన ఈ పిటిషన్‌ను ఈనెల 26న విచారించనున్నట్లు చీఫ్ జస్టిస్ పి. సదాశివం, జస్టిస్ రంజనా దేశాయ్, జస్టిస్ రంజన్ గొగైలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని, తెలంగాణరాష్ర్టం ఏర్పాటుకు తదుపరి చర్యలు తీసుకోకుండా కేంద్రాన్ని నిరోధించాలని పిటిషనర్ కోరారు. ఆంధ్రా ప్రాంతం, హైదరాబాద్ రాష్ర్టంలో ఒకభాగం, తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడిందని, ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనను 1969, 1972లలో తిరస్కరించారని ఆ రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రాంతీయ అసమానతలను తొలగించే ఉద్దేశంతో విద్య, ఉద్యోగాలలో స్థానిక రిజర్వేషన్లు కల్పిస్తూ 1973లో రాజ్యాంగాన్ని సవరించారని, ఆర్టికల్ 371డిని చేర్చారని పిటిషన్లో వివరించారు. ఇపుడు రాష్ట్రాన్ని విడగొట్టడం వల్ల రాజ్యాంగంలోని 371డి కింద లభిస్తున్న స్థానిక రిజర్వేషన్ హక్కులు కోల్పోతారని, తర్వాత వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వృథాగా మారుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు తమ స్వార్థం కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంచేశారని, తెలంగాణ రాష్ర్టం ప్రకటించడంతో విభజనను వ్యతిరేకిస్తూ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలోని ప్రజలు ఉద్యమిస్తున్నారని, పాలనను స్తంభింపజేస్తున్నారని పిటిషన్లో వివరించారు. హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా చేస్తారన్న ప్రకటనతో సీమాంధ్ర ప్రజలలో అభద్రతాభావం, అసహనం పెరిగిపోయాయని, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమ్మెను ప్రారంభించారని పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయ వత్తిళ్లకు లొంగి ఎస్సార్సీ నియమించకుండానే ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టడానికి చర్యలు తీసుకోవడం చట్టసమ్మతమేనా అని పిటిషనర్ ప్రశ్నించారు. మాయావతి సీఎంగా ఉండగా ఉత్తరప్రదేశ్‌ను విడగొట్టడానికి అసెంబ్లీ చేసిన తీర్మానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని, అలాగే దేశంలో బోడోలాండ్, గూర్ఖాలాండ్, మరఠ్వాడా వంటి అనేక డిమాండ్లున్నా పట్టించుకోకపోవడాన్ని కేంద్రం ఎలా సమర్థించుకుంటుందని పిటిషనర్ ప్రశ్నించారు. -
సుప్రీం ధర్మాసనం ఎదుటకురానున్న పీపీ పాండే కేసు
ఇష్రత్ జహన్ హత్య కేసులో తనను అరెస్ట్ చేయాడాన్ని సవాల్ చేస్తు గుజరాత్ రాష్ట్ర అడిషనల్ డీజీపీ పీపీ పాండే చేసుకున్న అభ్యర్థను సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం పరిశీలించింది. ఆ కేసుకు సంబంధించిన వివరాలు పాండే తరుపు న్యాయమూర్తి వాదనలు సోమవారం ధర్మాసనం ఎదుట వింటామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం వెల్లడించారు. 2004, జూన్ 15న ఇష్రత్ జహన్ హత్య కేసుపై దర్యాప్తు చేసిన సీబీఐ పోలీసు అధికారులు పాండేతోపాటు మరో కొంత మంది ప్రమేయం ఉందని సీబీఐ ఆరోపించింది. ఈ నేపథ్యంలో పలువురు పోలీసు అధికారులను సీబీఐ విచారించి అరెస్ట్ చేసింది. ఆ క్రమంలో పీ.పీ.పాండే పరారయ్యారు. ఆయన్ని ఇటీవలే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. తాను చేయని తప్పుకు సీబీఐ అరెస్ట్ చేసిందని ఆయన సుప్రీం కోర్టును అశ్రయించారు. దీంతో పాండే కేసు సోమవారం ధర్మాసనం విచారించనుంది.