'నా నియామకంపై వివాదం లేదు'
తిరువనంతపురం: కేరళ గవర్నర్ గా తనను నియమించడం పట్ల ఎటువంటి వివాదం లేదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పళనిస్వామి సదాశివం అన్నారు. తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు నియామకం జరిగివుంటే ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సివుండేదని, కానీ తాను పదవీవిరమణ చేసి కొన్ని నెలలు గడిచినందునా వివాదం లేదని ఆయన వివరించారు.
తాను ఎటువంటి వ్యాపారాలు చేయబోనని, కార్పొరేట్ సంస్థలకు సలహాలు అందించబోనని పదవీ విరమణ రోజే చెప్పానని అన్నారు. కేరళ గవర్నర్ గా సదాశివంను కేంద్ర ప్రభుత్వం నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ, కేరళ ప్రభుత్వం తప్పుబట్టిన నేపథ్యంలో ఆయనీ వివరణయిచ్చారు.