రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారు?
సాక్షి లీగల్ కరస్పాండెంట్, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుచేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్నిసవాలు చేస్తూ సుప్రీంకోర్టులో గురువారం ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది పి.వి. కృష్ణయ్య దాఖలుచేసిన ఈ పిటిషన్‌ను ఈనెల 26న విచారించనున్నట్లు చీఫ్ జస్టిస్ పి. సదాశివం, జస్టిస్ రంజనా దేశాయ్, జస్టిస్ రంజన్ గొగైలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని, తెలంగాణరాష్ర్టం ఏర్పాటుకు తదుపరి చర్యలు తీసుకోకుండా కేంద్రాన్ని నిరోధించాలని పిటిషనర్ కోరారు.
ఆంధ్రా ప్రాంతం, హైదరాబాద్ రాష్ర్టంలో ఒకభాగం, తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడిందని, ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనను 1969, 1972లలో తిరస్కరించారని ఆ రిట్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రాంతీయ అసమానతలను తొలగించే ఉద్దేశంతో విద్య, ఉద్యోగాలలో స్థానిక రిజర్వేషన్లు కల్పిస్తూ 1973లో రాజ్యాంగాన్ని సవరించారని, ఆర్టికల్ 371డిని చేర్చారని పిటిషన్‌లో వివరించారు. ఇపుడు రాష్ట్రాన్ని విడగొట్టడం వల్ల రాజ్యాంగంలోని 371డి కింద లభిస్తున్న స్థానిక రిజర్వేషన్ హక్కులు కోల్పోతారని, తర్వాత వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వృథాగా మారుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు తమ స్వార్థం కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంచేశారని, తెలంగాణ రాష్ర్టం ప్రకటించడంతో విభజనను వ్యతిరేకిస్తూ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలోని ప్రజలు ఉద్యమిస్తున్నారని, పాలనను స్తంభింపజేస్తున్నారని పిటిషన్‌లో వివరించారు. హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా చేస్తారన్న ప్రకటనతో సీమాంధ్ర ప్రజలలో అభద్రతాభావం, అసహనం పెరిగిపోయాయని, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమ్మెను ప్రారంభించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
రాజకీయ వత్తిళ్లకు లొంగి ఎస్సార్సీ నియమించకుండానే ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టడానికి చర్యలు తీసుకోవడం చట్టసమ్మతమేనా అని పిటిషనర్ ప్రశ్నించారు. మాయావతి సీఎంగా ఉండగా ఉత్తరప్రదేశ్‌ను విడగొట్టడానికి అసెంబ్లీ చేసిన తీర్మానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని, అలాగే దేశంలో బోడోలాండ్, గూర్ఖాలాండ్, మరఠ్వాడా వంటి అనేక డిమాండ్లున్నా పట్టించుకోకపోవడాన్ని కేంద్రం ఎలా సమర్థించుకుంటుందని పిటిషనర్ ప్రశ్నించారు. సాక్షి లీగల్ కరస్పాండెంట్, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుచేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్నిసవాలు చేస్తూ సుప్రీంకోర్టులో గురువారం ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది పి.వి. కృష్ణయ్య దాఖలుచేసిన ఈ పిటిషన్‌ను ఈనెల 26న విచారించనున్నట్లు చీఫ్ జస్టిస్ పి. సదాశివం, జస్టిస్ రంజనా దేశాయ్, జస్టిస్ రంజన్ గొగైలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని, తెలంగాణరాష్ర్టం ఏర్పాటుకు తదుపరి చర్యలు తీసుకోకుండా కేంద్రాన్ని నిరోధించాలని పిటిషనర్ కోరారు. ఆంధ్రా ప్రాంతం, హైదరాబాద్ రాష్ర్టంలో ఒకభాగం, తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడిందని, ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనను 1969, 1972లలో తిరస్కరించారని ఆ రిట్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రాంతీయ అసమానతలను తొలగించే ఉద్దేశంతో విద్య, ఉద్యోగాలలో స్థానిక రిజర్వేషన్లు కల్పిస్తూ 1973లో రాజ్యాంగాన్ని సవరించారని, ఆర్టికల్ 371డిని చేర్చారని పిటిషన్‌లో వివరించారు. ఇపుడు రాష్ట్రాన్ని విడగొట్టడం వల్ల రాజ్యాంగంలోని 371డి కింద లభిస్తున్న స్థానిక రిజర్వేషన్ హక్కులు కోల్పోతారని, తర్వాత వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వృథాగా మారుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు తమ స్వార్థం కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంచేశారని, తెలంగాణ రాష్ర్టం ప్రకటించడంతో విభజనను వ్యతిరేకిస్తూ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలోని ప్రజలు ఉద్యమిస్తున్నారని, పాలనను స్తంభింపజేస్తున్నారని పిటిషన్‌లో వివరించారు. హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా చేస్తారన్న ప్రకటనతో సీమాంధ్ర ప్రజలలో అభద్రతాభావం, అసహనం పెరిగిపోయాయని, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమ్మెను ప్రారంభించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజకీయ వత్తిళ్లకు లొంగి ఎస్సార్సీ నియమించకుండానే ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టడానికి చర్యలు తీసుకోవడం చట్టసమ్మతమేనా అని పిటిషనర్ ప్రశ్నించారు. మాయావతి సీఎంగా ఉండగా ఉత్తరప్రదేశ్‌ను విడగొట్టడానికి అసెంబ్లీ చేసిన తీర్మానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని, అలాగే దేశంలో బోడోలాండ్, గూర్ఖాలాండ్, మరఠ్వాడా వంటి అనేక డిమాండ్లున్నా పట్టించుకోకపోవడాన్ని కేంద్రం ఎలా సమర్థించుకుంటుందని పిటిషనర్ ప్రశ్నించారు.