న్యూఢిల్లీ: ఉన్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం వ్యవస్థ సరైనదేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం సమర్థించారు. అయితే, దీనిని మార్చేందుకు బిల్లును తెచ్చే అధికారం కేంద్రానికి ఉందన్నారు. బిల్లులోని అంశాలపైన, దానిని ఆమోదించిన తీరుపైన తానేమీ వ్యాఖ్యలు చేయబోవడం లేదని, బిల్లును తెచ్చే అధికారం కేంద్రానికి ఉందని, దానిని అంగీకరించాలా లేదా తిరస్కరించాలా అనేది ప్రజలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. న్యాయ పరిపాలనపై శనివారం ఢిల్లీలో ఏర్పాటైన సదస్సును ప్రారంభించిన సందర్భంగా జస్టిస్ సదాశివం మాట్లాడారు.