పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషించాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాను ఇటీవల వివాదాలను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంపై మరొకరు ఫిర్యాదు చేశారు.
తాజాగా ఆదిపురుష్ సినిమాపై అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సెన్సార్ బోర్డు అనుమతి లేకుండానే ప్రోమోను విడుదల చేశారని ఆరోపిస్తూ తివారి అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సినీ నిర్మాత ప్రోమోను రిలీజ్ చేయడం నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సెన్సార్ బోర్డుకు నోటీసులిచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఫిబ్రవరి 21 కి వాయిదా వేసింది.
ఈ సినిమాలో సీతా దేవిగా కృతిసనన్ ధరించిన దుస్తులపై కూడా పిటిషన్‌లో అభ్యంతరాలు తెలిపారు. రాముడు, సీత దేవతలను ప్రజలు నమ్ముతారని.. అయితే ఈ చిత్రంలో వారి నమ్మకాలకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. సినిమా నిర్మాత, దర్శకుడిని 'ప్రతివాదులు పేర్కొంటూ పిటిషన్ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment