
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి తన చేతిలో తుపాకీని వాడినట్టుగానే సోషల్ మీడియాను వాడవచ్చునని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. క్రిమినల్ కేసులు, బెయిల్ వంటి అంశాల్లో సోషల్ మీడియా ద్వారా చేసే పోస్టులపై మార్గదర్శకాలుండాలంది. కరోనా కట్టడి, లాక్‌డౌన్ వంటి అంశాల్లో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిలను లక్ష్యంగా చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఆరోపణలపై కాంగ్రెస్ నేత సచిన్ చౌధరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టు సచిన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఏడాదిన్నర పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని షరతు విధించింది. దీంతో సచిన్ సుప్రీంను ఆశ్రయించారు. శుక్రవారం దీని విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ బాబ్డే సోషల్ మీడియాకి సచిన్ దూరంగా ఉండాలన్న హైకోర్టు ఆదేశాలను సమర్థించారు. ఏదైనా కేసులో నిందితుడు తుపాకీకి దూరంగా ఉండాలని ఆదేశం ఇవ్వడం ఎలాంటిదో, సామాజిక మాధ్యమాలకి దూరంగా ఉండమని చెప్పడం అలాంటిదేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment