Sachin Choudhary
-
సోషల్ మీడియా ఓ గన్నులాంటిది: సుప్రీం
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి తన చేతిలో తుపాకీని వాడినట్టుగానే సోషల్ మీడియాను వాడవచ్చునని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. క్రిమినల్ కేసులు, బెయిల్ వంటి అంశాల్లో సోషల్ మీడియా ద్వారా చేసే పోస్టులపై మార్గదర్శకాలుండాలంది. కరోనా కట్టడి, లాక్డౌన్ వంటి అంశాల్లో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిలను లక్ష్యంగా చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఆరోపణలపై కాంగ్రెస్ నేత సచిన్ చౌధరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టు సచిన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఏడాదిన్నర పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని షరతు విధించింది. దీంతో సచిన్ సుప్రీంను ఆశ్రయించారు. శుక్రవారం దీని విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ బాబ్డే సోషల్ మీడియాకి సచిన్ దూరంగా ఉండాలన్న హైకోర్టు ఆదేశాలను సమర్థించారు. ఏదైనా కేసులో నిందితుడు తుపాకీకి దూరంగా ఉండాలని ఆదేశం ఇవ్వడం ఎలాంటిదో, సామాజిక మాధ్యమాలకి దూరంగా ఉండమని చెప్పడం అలాంటిదేనన్నారు. -
సిగ్గుచేటు
డోపీగా తేలిన భారత పారా అథ్లెట్ సచిన్ గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. పతకాల ఖాతా తెరవకముందే దేశానికి అప్రతిష్ట తెచ్చిపెట్టాడు పారా పవర్‌లిఫ్టర్ సచిన్ చౌదరి. డోప్ టెస్టులో పట్టుబడి ఇంటిబాట పట్టాడు. అయితే ఈ టెస్టు జరిపింది ఇప్పుడు కాదు. కామన్వెల్త్ పోటీలకు బయలుదేరకముందే జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) గత నెలలో జరిపిన ‘అవుట్ ఆఫ్ కాంపిటీషన్’ టెస్టులో సచిన్ నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు ఆలస్యంగా వెల్లడైంది. దీంతో అతని పేరును పోటీల జాబితా నుంచి తొలగించినట్లు పారా స్పోర్ట్స్ సభ్యుడొకరు తెలిపారు. అతను మళ్లీ గ్లాస్గోకు వచ్చే అవకాశం లేదన్నారు. అనుభవజ్ఞుడైన సచిన్ చౌదరి నిష్ర్కమణతో పారా పవర్‌లిఫ్టింగ్‌లో భారత్ పతకం సాధించే అవకాశం కోల్పోయినట్లయింది. అయితే ఈ విషయమై తమకు ఇంతవరకు ఎటువంటి సమాచారం రాలేదని భారత పారాలింపిక్స్ కమిటీ అధ్యక్షుడు రాజేష్ తోమర్ తెలిపారు.