జస్టిస్ బాబ్డే
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల తీర్పులను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలపై కాబోయే ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే(63) 18న బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో కొన్ని కథనాలు జడ్జీల తీర్పులను తప్పుపట్టడంతో ఆగకుండా వారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఉంటున్నాయి. అలాంటి వేధింపుల అనుభవం నాకు కూడా కలిగింది. న్యాయమూర్తులపై వ్యక్తిగత విమర్శలను పరువు నష్టం కింద కూడా భావించవచ్చు. అయితే, ఇలాంటి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో మాకు కూడా తెలియడం లేదు. ఏదైనా చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది కదా’అని వ్యాఖ్యానించారు. కేసుల విచారణ సకాలంలో జరగాలన్నారు. లేకుంటే నేరాలు పెరిగిపోతున్నాయని, శాంతి భద్రతలు దిగజారుతాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment