లక్నో: కేవలం పెళ్లి కోసమే మతం మారడం సరికాదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతించారు. లవ్ జిహాద్ విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని శనివారం చెప్పారు. ఆడబిడ్డల, అక్కాచెల్లెమ్మల గౌరవ మర్యాదలతో కొందరు ఆటలాడుకుంటున్నారని, వారు ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే రామ్‌నామ్ సత్య యాత్ర ప్రారంభిస్తామని గట్టిగా హెచ్చరించారు. అలాంటి వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకొస్తామన్నారు. లవ్ జిహాద్‌కు చెక్ పెట్టడంపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మల్హానీ అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుంది. శనివారం ఎన్నికల ప్రచారంలో యోగి మాట్లాడారు. లవ్ జిహాద్‌లో భాగస్వాములైన వారి పోస్టర్లను రోడ్ల పక్కన ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. (అస్సాం, మిజోరాంల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు)
Comments
Please login to add a commentAdd a comment