సచిన్‌కు ‘భారతరత్న’పై పిటిషన్ | Bharat Ratna for Sachin Tendulkar: PIL filed challenging decision | Sakshi
Sakshi News home page

సచిన్‌కు ‘భారతరత్న’పై పిటిషన్

Published Fri, Nov 22 2013 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM

Bharat Ratna for Sachin Tendulkar: PIL filed challenging decision

లక్నో: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న అవార్డు ప్రకటించడంపై అలహాబాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. సచిన్‌కు భారతరత్న ఇవ్వడం విశృంఖలత్వమేనని పిటిషనర్లు తమ పిల్‌లో పేర్కొన్నారు. ఈ అత్యున్నత పౌర పురస్కారానికి జరుగుతున్న ఎంపిక విధానాన్ని సమీక్షించాలని ధర్మాసనానికి వారు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్, సామాజిక ఉద్యమకార్యకర్త నూతన్ ఠాకూర్‌లు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో గురువారం పిల్ దాఖలు చేశారు. ఈ నెల 25న ఇది విచారణకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement