ప్రేమ జీహాద్ అనే పదం ఉపయోగించకుండా నిరోధించాలని, బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై అలహాబాద్ హైకోర్టు స్పందించింది.
లక్నో: ప్రేమ జీహాద్ అనే పదం ఉపయోగించకుండా నిరోధించాలని, బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై అలహాబాద్ హైకోర్టు స్పందించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్‌ను కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా గురువారం ఆదేశించింది.
ఇందుకు 10 రోజుల సమయం ఇచ్చింది. ప్రేమ పేరుతో హిందూ యువతులను ముస్లిం మతంలోకి మార్చేందుకు ముస్లిం యువకులు కుట్రపన్నుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. దీన్నే 'లవ్ జిహాద్'గా పేర్కొంటోంది. అయితే బీజేపీ ఆరోపణలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తోసిపుచ్చింది.