
అలహాబాద్ : వివాహం కోసమే మతం మారాలనుకోవడం ఆమోదనీయం కాదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. మతాంతర వివాహం చేసుకున్న తమకు పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ ఒక జంట దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ముస్లిం అయిన యువతి పెళ్లికి నెల రోజుల ముందు మాత్రమే హిందూ మతం తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. పెళ్లి కోసమే ఈ మతమార్పిడి జరిగిందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని న్యాయమూర్తి జస్టిస్ మహేశ్ చంద్ర త్రిపాఠి వ్యాఖ్యానించారు. వివాహ కోసమే మతం మారడం ఆమోదనీయం కాదంటూ మరో కేసులో, 2014లో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ఉటంకించారు. ఇస్లాం మతానికి మారి ముస్లింను పెళ్లి చేసుకున్న హిందూ యువతికి సంబంధించిన కేసులో 2014లో అలహాబాద్ హైకోర్టు.. ‘ఇస్లాం విశ్వాసాలు, సంప్రదాయాల గురించి ఎలాంటి అవగాహన లేకుండా.. ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం మాత్రమే మతం మారడం సరైనది కాదు’ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment