religion change
-
పెళ్లి కోసమే మతం మారడం సరికాదు
అలహాబాద్ : వివాహం కోసమే మతం మారాలనుకోవడం ఆమోదనీయం కాదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. మతాంతర వివాహం చేసుకున్న తమకు పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ ఒక జంట దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ముస్లిం అయిన యువతి పెళ్లికి నెల రోజుల ముందు మాత్రమే హిందూ మతం తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. పెళ్లి కోసమే ఈ మతమార్పిడి జరిగిందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని న్యాయమూర్తి జస్టిస్ మహేశ్ చంద్ర త్రిపాఠి వ్యాఖ్యానించారు. వివాహ కోసమే మతం మారడం ఆమోదనీయం కాదంటూ మరో కేసులో, 2014లో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ఉటంకించారు. ఇస్లాం మతానికి మారి ముస్లింను పెళ్లి చేసుకున్న హిందూ యువతికి సంబంధించిన కేసులో 2014లో అలహాబాద్ హైకోర్టు.. ‘ఇస్లాం విశ్వాసాలు, సంప్రదాయాల గురించి ఎలాంటి అవగాహన లేకుండా.. ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం మాత్రమే మతం మారడం సరైనది కాదు’ అని పేర్కొంది. -
పెళ్లి: మతం మార్పించి.. మొహం చాటేశాడు!
మల్కాజిగిరి: ఓ యువతిని పెళ్లి పేరుతో మోసగించి ఏడు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుణ్ని ఎల్ఓసీ(లుక్ అవుట్ సర్టిఫికెట్) ద్వారా ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకొని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు. ఎస్హెచ్ఓ మన్మోహన్ కథనం ప్రకారం..దారుల్‌షిఫాకు చెందిన సఫ్దర్ అబ్బాస్ జైదీ(28) దుబాయిలో 2014 నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అంతకు ముందు 2012 నుంచి దుబాయికి వెళ్లే వరకు హైటెక్ సిటీ ప్రాంతంలో పనిచేశాడు. ఆ సమయంలో పరిచయమైన ఓ హిందూ యువతిని ప్రేమించాడు. అనంతరం దుబాయికి వెళ్లిన అబ్బాస్ కొన్ని రోజుల తర్వాత ఆ యువతిని కూడా అక్కడికి పిలిపించుకొని ఉద్యోగంలో చేర్చాడు. వివాహం చేసుకోవడానికి అబ్బాస్ తన తల్లితండ్రులను ఒప్పిస్తానని అందుకు మతం మారాలని నమ్మించి మత మార్పిడి చేయించాడు. అనంతరం వారిద్దరూ గతేడాది నగరానికి తిరిగి వచ్చారు. తల్లితండ్రులతో మాట్లాడానని ఏప్రిల్ 17న పెళ్లి, 28న రిసెప్షన్ ఏర్పాటు చేశామని ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఆ యువతిని నమ్మించారు. జనవరిలో దుబాయికి వెళ్లిన అనంతరం అబ్బాస్ ఆమెతో మాట్లాడడం మానేశాడు. ఈ సంఘటనపై ఆ యువతి తల్లి ఫిబ్రవరిలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాచకొండ కమిషనరేట్ కమిషనర్ మహేష్ భగవత్ నిందితునిపై ఎల్ఓసీ జారీ చేశారు. ఈ నెల 27న నగరానికి వచ్చిన అబ్బాస్‌ను ఎయిర్‌పోర్టు పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకొని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ప్రేమ పేరుతో మోసం
సాక్షి హైదరాబాద్,మల్కాజిగిరి: వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలంటే మతం మారాలన్నాడు. మతం మారినా చివరకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దొంగతనం నెపం అంటగట్టాడు. దీనిపై మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బాధితురాలు మీడియాను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్కాజిగిరికి చెందిన యువతి, దారుల్సిఫా నూర్ఖాన్ బజార్‌కు చెందిన సప్దర్ అబ్బాస్‌జైదీ నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రేమించుకున్నారు. అనంతరం అబ్బాస్ జైదీ దుబాయ్‌లో ఉద్యోగం రావడంతో అతను అక్కడికి వెళ్లాడు. అనంతరం సదరు యువతి కూడా ఉద్యోగం నిమిత్తం అక్కడికే వెళ్లింది. మతం మార్చుకుంటేనే తన కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరిస్తారని చెప్పడంతో బాధితురాలు 2014 జులైలో మతం మార్చుకుంది. గత ఏప్రెల్ 17న అక్కడే వివాహం చేసుకొని హైదరాబాద్‌లో 28న రిసెప్ఫన్ ఏర్పాటు చేద్దామని చెప్పిన అబ్బాస్ డిసెంబర్ నెలలో తన తల్లిదండ్రులు అంగీకరించనందున పెళ్లి చేసుకోనని చెప్పాడు. అదే సమయంలో అబ్బాస్ జైదీ తండ్రి సఫ్దర్ అబ్బాస్ నాంపల్లిలోని హజ్ హౌస్‌కు యువతి తల్లితండ్రులను పిలిపించి కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకున్నాడు. గత నెల 29న ఇండియాకు వస్తున్న యువతి తన ల్యాప్‌టాప్ దొంగిలించిందని అబ్బాస్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె ఇమిగ్రేషన్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. ఈ సంఘటనపై ఫిర్యాదు చేసేందుకు మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ను సంప్రదించగా అబ్బాయి దుబాయిలో ఉన్నందున కేసు నమోదు సాధ్యం కాదని కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవాలని చెప్పాడన్నారు. డీసీపీని కలిసేందుకు ప్రయత్నించగా వేరే దర్యాప్తులో ఉన్నారని అక్కడి అధికారులు చెప్పారన్నారు. దీనిపై ఇన్స్పెక్టర్ కొమరయ్యను వివరణ కోరగా మొదట వచ్చినపుడు కేసు పెట్టడానికి ఇష్ట పడలేదని అబ్బాయి తరుపున వారిని పిలిపించి మాట్లాడమని చెప్పారన్నారు. గురువారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
తల్లిని చంపి... ఇంట్లోనే పాతిపెట్టారు
హైదరాబాద్: అమ్మ ప్రేమను మరిచారు... పేగు బంధాన్ని మర్చిపోయారు. లాలిస్తూ తినిపించిన గోరు ముద్దలూ గుర్తుకు లేవు. కన్నతల్లిని కడతేర్చడమే కాదు, తాము ఉండే ఇంట్లోనే తవ్వి పాతి పెట్టేశారు అన్నా చెల్లెళ్లు. ఏడాది క్రితం నగరంలోని బేగంబజార్ ప్రాంతంలో జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగు చూసింది. ఈ ఘటనలో అన్నా చెల్లెళ్లు, బాబు, కిరణ్‌తో పాటు హత్యకు సహకరించిన నజామ్ అనే వ్యక్తిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వివరాలు....బాబు, కిరణ్(మహిళ) చిన్నప్పుడే తండ్రి మరణించడంతో, వారి తల్లి మతం మారి ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. పిల్లలను కూడా మతం మార్చించగా... పెద్దయిన తర్వాత వారు తిరిగి హిందూ మతంలోకి మారినట్లు తెలుస్తోంది. దీనిపై వేధింపులు ఎక్కువ కావడంతో 2014 జనవరి 1న తల్లిని హత్యచేశారని పోలీసులు తెలిపారు.