ప్రధాని మోడీకి అలహాబాద్ హైకోర్టు నోటీసులు | Allahabad High Court issues notice to Narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోడీకి అలహాబాద్ హైకోర్టు నోటీసులు

Published Sat, Jul 19 2014 3:15 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ప్రధాని మోడీకి అలహాబాద్ హైకోర్టు నోటీసులు - Sakshi

ప్రధాని మోడీకి అలహాబాద్ హైకోర్టు నోటీసులు

అలహాబాద్:ప్రధాని నరేంద్రమోడీకి అలహాబాద్ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మోడీ ఎన్నికవ్వడం చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌కు సంబంధించి ఈ నోటీసులిచ్చింది. వారణాసి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన అజయ్‌రాయ్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను విచారించిన వీటిని జారీ చేసింది.  ఎన్నికల అఫిడవిట్‌లో భార్య యశోదా పాన్ కార్డు వివరాల కాలమ్‌ను మోడీ ఖాళీగా వదిలేశారని, ఎన్నికల్లో రూ. 70 లక్షలకు మించి ఖర్చు చేశారని అజయ్ ఆరోపించారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement