కోర్టులో కేజ్రీవాల్కు ఊరట | HC stays bailable warrant againts Kejriwal | Sakshi
Sakshi News home page

కోర్టులో కేజ్రీవాల్కు ఊరట

Published Mon, Aug 3 2015 5:27 PM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM

కోర్టులో కేజ్రీవాల్కు ఊరట

కోర్టులో కేజ్రీవాల్కు ఊరట

లక్నో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కోర్టులో ఊరట లభించింది. అమేథి కోర్టు కేజ్రీవాల్ కు జారీ చేసిన వారెంట్పై అలహాబాద్ హైకోర్టు మూడు వారాల పాటు స్టే విధించింది. సోమవారం అలహాబాద్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

గత లోక్సభ ఎన్నికల సందర్బంగా కేజ్రీవాల్ విద్వేషపూరిత ప్రసంగం చేసినట్టు కేసు నమోదైంది. కేసుకు సంబంధించి అమేథి కోర్టు కేజ్రీవాల్కు బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement