అయోధ్య భూవివాద పరిష్కారానికి ఇద్దరు పరిశీలకులను నియమించాలని అలహాబాద్ హైకోర్టును సుప్రీం ఆదేశించింది.
అయోధ్య కేసు విచారణ..
Published Mon, Sep 11 2017 4:46 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
న్యూఢిల్లీ: అయోధ్య స్థల వివాదంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. అయోధ్య భూవివాద పరిష్కారానికి ఇద్దరు పరిశీలకులను నియమించాలని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిని సుప్రీం ఆదేశించింది. వీరి నియామకానికి పదిరోజుల గడువునిచ్చింది. బ్రాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం ఈ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయోధ్య భూముల్లో రామమందిర నిర్మాణం చేపడతామని విశ్వహిందూ పరిషత్ ప్రకటించగా.. అయోద్య భూములు ముస్లింలకే చెందినవేనని వక్ఫ్ బోర్డు నేతలు వాపోతున్నారు.
Advertisement
Advertisement