
రాహుల్ ఆచూకీ తెలపాలని కోర్టులో పిల్
సెలవుపై వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎక్కడున్నారో తెలపాలంటూ అశోక్ పాండే అనే న్యాయవాది శనివారం అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.
లక్నో: సెలవుపై వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎక్కడున్నారో తెలపాలంటూ అశోక్ పాండే అనే న్యాయవాది శనివారం అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ‘రాహుల్ ఒక ఎంపీ, పార్టీ ఉపాధ్యక్షుడు. ఆయన రక్షణ భారత ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించినద’ని పిల్‌లో పేర్కొన్నారు. రాహుల్ ఎస్‌పీజీ భద్రత పొందుతున్నందున, సమాచారం ఇవ్వకుండా వెళ్లడానికి వీల్లేదన్నారు. రాహుల్ ఆచూకీ తెలుసుకోవాల్సిందిగా హోంమంత్రిత్వ శాఖను, ఎస్‌పీజీ డీజీని ఆదేశించాలని ఆయన కోర్టుకు విన్నవించారు.