మథురలోని జవహర్‌బాగ్ పార్కులో జరిగిన హింసాకాండకు సంబంధించిన కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అప్పగిస్తూ అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అలహాబాద్: మథురలోని జవహర్‌బాగ్ పార్కులో జరిగిన హింసాకాండకు సంబంధించిన కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అప్పగిస్తూ అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2016లో జవహర్ పార్కులో జరిగిన హింసాకాండపై సీబీఐ విచారణ కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్, మథుర నివాసి విజయ్ పాల్‌సింగ్ తోమర్‌లు పిటిషన్ లు దాఖలు చేశారు.
2014, జనవరిలో జవహర్‌బాగ్‌లో సమావేశం నిమిత్తం రామ్‌వృక్ష్ణ్„ యాదవ్‌కు చెందిన స్వాధీన్భారత్ వేదిక్ సత్యాగ్రహ సంస్థకు రెండు రోజులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే ఆ సంస్థ సభ్యులు ఆ పార్కును రెండేళ్ల పాటు ఆక్రమిం చుకున్నారు. 2016లో హైకోర్టు ఆదేశాల మేరకు సంస్థ సభ్యులను ఖాళీ చేయించే క్రమంలో జరిగిన హింసలో ఇద్దరు పోలీసులు సహా 20 మంది మరణించారు.