కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసకు సంబంధించిన వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సంఘటనలపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఇప్పటి వరకు తొమ్మిది కేసులు నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా, తగిన సమయంలో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని సీబీఐ పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కేసుల విచారణ నిమిత్తం నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామని, బాధితుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసేందుకు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు పంపినట్లు సీబీఐ అధికారి ఒకరు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment