లక్నో: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సూచించింది. ఈసీ సహా ప్రధాని మోదీని కూడా ఈ మేరకు కోరింది. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడింది. పైగా ఒమిక్రాన్ సెకండ్ వేవ్‌ను మించి ఉండొచ్చని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 300 దాటాయి. ఈ క్రమంలోనే సర్వత్రా ఆందోళన నెలకొందని అభిప్రాయపడింది. గతంలో యూపీలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్రాల్లో కేసులు, మరణాలు విపరీతంగా పెరిగడం చూశాం. మనం వాటిని పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కనుక వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న యూపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా.. వీలైతే రెండు నెలల పాటు వాయిదా వేయాలని కోరింది. ప్రజలు ప్రాణాలు ముఖ్యమని ఆ తర్వాతే ఎన్నికలైనా ఏవైనా అని ధర్మాసనం అభిప్రాయపడింది. వచ్చే ఏడాది యూపీ సహా 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అలహాబాద్ కోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి, ప్రధాన మంత్రికి ఈ మేరకు సూచన చేసింది.
చదవండి: ఆందోళనలో 50 లక్షల మంది ఉద్యోగుల భవితవ్యం!.. ఆ చట్టానికి మోక్షం ఎప్పుడో?
Comments
Please login to add a commentAdd a comment