బెంగళూరు: రాష్ష్ర్టంలో గోవధ నిషేధం త్వరలోనే వాస్తవరూపం దాల్చబోతోందని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి అన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో గోవధను నిషేధిస్తూ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ అంశంపై ఇప్పటికే మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖా మంత్రిని కోరినట్లు పేర్కొన్నారు. ఇక ‘లవ్ జిహాద్’పై చర్చ నేపథ్యంలో పెళ్లి పేరుతో మతం మారేందుకు కుదరదని ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కర్ణాటకలో అమలు చేస్తామని సీటీ రవి తెలిపారు. తమ సోదరీమణులను ‘లవ్ జీహాద్’ పేరుతో మతం మార్చే ప్రయత్నం చేస్తే సహించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.(చదవండి: లవ్ జిహాద్‌ను అంతం చేస్తాం: యడియూరప్ప)
కాగా, తమ మతాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ గత జూలైలో పెళ్లి చేసుకున్న ఓ జంట అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. అమ్మాయి తన ఇష్టంతోనే మతం మారినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ విషయంలో జోక్యం చసుకోవద్దని అమ్మాయి తండ్రితో పాటు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని ఆ జంట కోర్టును కోరింది. అయితే వివాహం పేరుతో మతం మారడం కుదరదని పేర్కొంటూ కోర్టు వారి పిటిషన్ కొట్టివేసింది.
Cow Slaughter Ban will be a reality in Karnataka in the near future.
— C T Ravi 🇮🇳 ಸಿ ಟಿ ರವಿ (@CTRavi_BJP) November 20, 2020
In have asked Animal Husbandry Minister Sri @PrabhuChavanBJP to get "The Karnataka Prevention of Slaughter & Preservation of Cattle Bill" passed in the Cabinet and present the same in upcoming Assembly Session.
Comments
Please login to add a commentAdd a comment