అలహాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు నవంబరు 15న విచారించనుంది. ఎన్నిక ఎందుకు చెల్లదో వివరిస్తూ పిటిషనర్ అసంబద్ధ కారణాలు పేర్కొన్నారని, ఈ ఆరోపణలు ప్రజా ప్రతినిధుల చట్టం కిందకు రావనీ, అసలు ఇది విచారణార్హం కాదని మోదీ తరఫు న్యాయవాదులు వాదించారు. అయినా కోర్టు పిటిషన్‌ను విచారణకు తీసుకుంది.
ఆ ఎన్నికల్లో మోదీపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అజయ్ రాయ్ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు. మోదీ చిత్రాలున్న పోస్టర్లు, టీ షర్టులను జనాలకు పంచిపెట్టారనీ, ఒక విధంగా ఓటర్లకు లంచం ఇవ్వడం వంటిదని పిటిషనర్ అందులో పేర్కొన్నారు.
15న ‘మోదీ ఎన్నిక చెల్లదు’ పిటిషన్‌పై విచారణ
Published Thu, Oct 20 2016 10:41 AM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM
Advertisement