హైకోర్టులో ప్రధాని మోదీకి ఊరట
అలహాబాద్: ప్రధాని నరేంద్ర మోదీకి అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి మోదీ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం బుధవారం తిరస్కరించింది. జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. విచారణకు జరపాల్సిన ప్రతాలేవి పిటిషనర్ సమర్పించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. కక్షిదారు పూర్తి వివరాలు ఇవ్వలేదని అన్నారు. మీడియా కథనాల ఆధారంగా అరకొర సమచారంతో పిటిషన్ వేశారని అభిప్రాయపడ్డారు.
2014 ఎన్నికల్లో మోదీ నామినేషన్ పత్రాల్లో అవాస్తవాలు ఉన్నాయనీ, ప్రజలకు డబ్బులు పంచడంతోపాటు మతపరమైన మనోభావాలను అడ్డం పెట్టుకుని ప్రచారం చేసి గెలిచారు కాబట్టి ఆయన ఎన్నిక చెల్లదని తీర్పునివ్వాలంటూ మోదీపై కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన అజయ్‌రాయ్ ఈ వ్యాజ్యం వేశారు.