
జస్టిస్ ఎస్.ఎన్. శుక్లా
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్.ఎన్.శుక్లాను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. మెడికల్ కాలేజీలకు అనుమతులిచ్చే విషయంలో ముడుపులు అందుకున్నారని జస్టిస్ శుక్లాపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వీటిపై విచారణ జరిపేందుకు మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ, సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌కే అగ్నిహోత్రి, మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ పీకే జైస్వాల్ నేతృత్వంలో త్రిసభ్య అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ శుక్లాపై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని తేల్చింది.
‘శుక్లా మీద వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని కమిటీ విచారణలో తేలింది. దీనిని తీవ్రంగా పరిగణించిన కమిటీ ఆయన్ను విధుల నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టింది. హైకోర్టులో ఆయన న్యాయపరమైన విధులు నిర్వర్తించేందుకు వీలు లేదు. దీంతో శుక్లాను విధుల నుంచి తొలగించండి’అని గొగోయ్ ప్రధానిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment