యూపీలో 12,460 నియామకాల రద్దు | 12,460 recruitments canceled in UP | Sakshi
Sakshi News home page

యూపీలో 12,460 నియామకాల రద్దు

Published Fri, Nov 2 2018 3:16 AM | Last Updated on Fri, Nov 2 2018 3:16 AM

12,460 recruitments canceled in UP - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన రెండు భారీ రిక్రూట్‌మెంట్లపై అలహాబాద్‌ హైకోర్టు గురువారం కీలక ఉత్తర్వులిచ్చింది. మొదటి దశలో 12,460 మందిని ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగాలకు ఎంపిక చేయగా, వారందరి ఉద్యోగాలనూ కోర్టు పూర్తిగా రద్దు చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన 2016 డిసెంబర్‌లో వెలువడగా, నియామక ప్రక్రియను ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి చేపట్టి మూడు నెలల్లో పూర్తి చేయాలని కోర్టు తాజాగా ఆదేశించింది.

ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పూర్తయిందే కానీ ఇంకా ఎవరినీ ఉద్యోగాల్లో నియమించలేదు. ఇక రెండో ప్రక్రియలో 68,500 ఉద్యోగాలకు ఇప్పటికే రాత పరీక్షలు పూర్తయ్యాయి. ఈ ప్రక్రియపై సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించింది. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం లంచాలు తీసుకుని, నిబంధనలు పాటించకుండా తమకు ఇష్టమైన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తోందంటూ పలువురు ఉద్యోగార్థులు కోర్టును ఆశ్రయించడంతో అలహాబాద్‌ హైకోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. రెండో నియామక ప్రక్రియలో అభ్యర్థుల సమాధాన పత్రాలను కూడా మార్చేశారనే ఆరోపణలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement