teachers posts
-
రాష్ట్ర స్థాయిలో డీఎస్సీ ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ప్రకటించిన డీఎస్సీ విధివిధానా లకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయింది. ఈ నెల 4వ తేదీన పూర్తి సమాచారం వెలువరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 11,062 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్ష విధానం, సిలబస్, రిజర్వేషన్లను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాల వారీగా పోస్టుల విభజన జరిగింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, భాషా పండితులు, ప్రత్యేక అవసరాల విద్యార్థులకు బోధించే టీచర్ల ఖాళీలను వెల్లడించారు. ఈ ప్రక్రియ మొత్తం జిల్లా అధికారుల పరిధిలోనే జరిగింది. ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే సమయంలో వీరి పాత్ర ఉండనుంది. కానీ పరీక్ష విధివిధానాల రూపకల్పన, ప్రశ్నపత్రాల తయారీ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక అన్నీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్రీకృత వ్యవస్థతోనే డీఎస్సీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రతి పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేస్తారు. ఈ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర విద్యాశాఖ మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తుంది. వారికి జిల్లా అధికారులు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుందని విధివిధానాల్లో పేర్కొననున్నారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా.. డీఎస్సీ సిలబస్‌పై అధికారులు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం. సబ్జెక్టు నిపుణులతో వివిధ విభాగాలకు సంబంధించిన ప్రశ్నల తయారీ అంతా రాష్ట్ర అధికారుల పరిధిలోనే జరుగుతుంది. ప్రశ్నపత్రం ఎక్కడా లీక్ అవ్వకుండా సాంకేతిక విభాగాన్ని పటిష్ట పరుస్తున్నారు. అవసరమైన కీలక పాస్వర్డ్స్ అన్నీ రాష్ట్ర ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉంచాలని నిర్ణయించారు. ముఖ్యమైన విభాగాల్లో పనిచేసే వారి గత చరిత్రను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. దీంతో ఎలాంటి ఫిర్యాదులు లేని వ్యక్తులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. టెట్‌కు 20 శాతం వెయిటేజ్ సెకండరీ గ్రేడ్, స్కూల్ అసిస్టెంట్ తదితర పోస్టులకు కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్), ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిర్వహించిన టెట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్టు తెలిసింది. పరీక్షా సమయం మూడు గంటల పాటు ఉండబోతోంది. మొత్తం 160 ప్రశ్నలతో, 80 మార్కులకు పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. మే 23 నుంచి పది రోజుల పాటు కంప్యూటర్ బేస్డ్‌గానే పరీక్ష ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ డీఎస్సీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అదనపు జిల్లా కలెక్టర్ వైస్ చైర్మన్‌గా, జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా పరిషత్ సీఈవోలు సభ్యులుగా ఉంటారు. వీరు పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ బాధ్యతలు నిర్వహిస్తారు. దరఖాస్తు స్వీకరణ మొత్తం ఆన్లైన్లో పద్ధతిలోనే ఉంటుంది. -
జిల్లా కేడర్‌గా టీచర్ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ పోస్టులను లోకల్ కేడర్‌గా ప్రభుత్వం నిర్ధారించింది. అయితే, వీరందరికి కలిపికాకుండా వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం జీవోలు 254, 255, 256లను జారీ చేశారు. హైకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, జిల్లాపరిషత్, మండల పరిషత్ యాజమాన్యంలోని ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, వాటి తత్సమాన పోస్టులను జిల్లా కేడర్‌గా ప్రభుత్వం నిర్ధారించింది. వాటి ఆధారంగానే భవిష్యత్తులో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని పేర్కొంది. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు ఇవే ఆధారం కానున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని గెజిటెడ్ హెడ్మాస్టర్ గ్రేడ్–1, గ్రేడ్–2 పోస్టులను మల్టీ జోనల్ కేడర్‌గా చేసింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్–1, గ్రేడ్–2 పోస్టుల లోకల్ కేడర్ ఆర్గనైజేషన్‌కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. హైస్కూల్ హెడ్మాస్టర్ పోస్టులు గతంలో జోనల్ కేడర్‌లో ఉండగా, ఇపుడు మల్టీ జోన్ పరిధిలోకి తెచ్చింది. ఆ పోస్టు బదలాయింపు రాష్ట్ర విద్యా శిక్షణా, పరిశోధన సంస్థ (ఎస్సీఈఆర్టీ), కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (సీటీఈ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్ఈ)లలో లెక్చరర్ పోస్టులను మల్టీ జోనల్ కేడర్‌కు ప్రభుత్వం బదలాయించింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవోకు సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. -
యూపీలో 12,460 నియామకాల రద్దు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన రెండు భారీ రిక్రూట్మెంట్లపై అలహాబాద్ హైకోర్టు గురువారం కీలక ఉత్తర్వులిచ్చింది. మొదటి దశలో 12,460 మందిని ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగాలకు ఎంపిక చేయగా, వారందరి ఉద్యోగాలనూ కోర్టు పూర్తిగా రద్దు చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన 2016 డిసెంబర్లో వెలువడగా, నియామక ప్రక్రియను ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి చేపట్టి మూడు నెలల్లో పూర్తి చేయాలని కోర్టు తాజాగా ఆదేశించింది. ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పూర్తయిందే కానీ ఇంకా ఎవరినీ ఉద్యోగాల్లో నియమించలేదు. ఇక రెండో ప్రక్రియలో 68,500 ఉద్యోగాలకు ఇప్పటికే రాత పరీక్షలు పూర్తయ్యాయి. ఈ ప్రక్రియపై సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించింది. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం లంచాలు తీసుకుని, నిబంధనలు పాటించకుండా తమకు ఇష్టమైన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తోందంటూ పలువురు ఉద్యోగార్థులు కోర్టును ఆశ్రయించడంతో అలహాబాద్ హైకోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. రెండో నియామక ప్రక్రియలో అభ్యర్థుల సమాధాన పత్రాలను కూడా మార్చేశారనే ఆరోపణలున్నాయి. -
ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలి
అనంతగిరి : ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ బదిలీలతో వికారాబాద్ జిల్లాలో ఏర్పడిన ఖాళీలను పదోన్నతులతో, కొత్త నియామకాలతో భర్తీ చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రత్నం అన్నారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బదిలీలతో వికారాబాద్ జిల్లాలో 1370 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఏర్పడినట్లు చెప్పారు. 2012 నుంచి ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడంతోనే వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇటీవల నిర్వహించిన బదిలీలతో వికారాబాద్ లాంటి గ్రామీణ ప్రాంత జిల్లాలో ఖాళీల సంఖ్య మరింతగా ఉందన్నారు. కనీసం విద్యావలంటీర్లు దొరకని మండలాలు ఉన్నాయని, ఈ కారణంగా పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ బడులపై నమ్మకం పోతుందన్నారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలనే ఉద్దేశంఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు. వేసవి సెలవుల్లో నిర్వహించాల్సిన బదిలీలను జూలైలో నిర్వహించడంతో విద్యార్థుల చేరికల్లో తీవ్ర ప్రభావం చూపిందన్నారు. జిల్లాలో చాలా బడు ల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా ప్రభత్వం స్పందించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలన్నారు. ప్రస్తుత ఉపాధ్యాయులకు ఉద్యోగన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్‌పై బదిలీలు చేసుకున్న వాటిని వెంటనే రద్దు చేయాలన్నారు. సీనియర్ ఉపాధ్యాయులు ఒప్పుకున్నాకనే జూనియర్ ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ ఇవ్వాలనే నిబంధన ఉన్నా అధికారులు పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఈ విషయంపైఉన్నతాధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా> జిల్లా ప్రధాన కార్యదర్శి టి. పవన్‌కుమార్, జిల్లా సభ్యులు మాణిక్యం, పరమేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
సర్దుబాటుకు ససేమిరా !
ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత నివారించేందుకు విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం ఉపాధ్యాయులను అవస్థల్లోకి నెట్టింది. ప్రస్తుతం ఒక ప్రాంతంలో సెటిలైన వారిని ప్రభుత్వ సౌలభ్యం కోసం ఉన్నఫళంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో కొందరు నూతన బాధ్యతల్లో చేరగా.. మిగిలిన వారు చేరేందుకు ససేమిరా అంటున్నారు. సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరతను తాత్కాలికంగా నివారించాలని ప్రభుత్వం, విద్యాశాఖ తలచింది. ఈ నేపథ్యంలో పని సర్దుబాటు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గత నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను అనుసరించి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత లేకుండా చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పొందుపరిచారు. జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ నేటి వరకు పూర్తి కాలేదు. ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి మరికొన్ని రోజుల వ్యవధి పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డీఈవో పూల్‌లో 20 మంది మిగులు ఉపాధ్యాయులున్నా వారిని ఇతర స్థానాలకు సర్దుబాటు చేయకుండా అలానే ఉంచారు. డీఈవోపై ఒత్తిడి... జిల్లాలోని వివిధ ఉన్నత పాఠశాలల్లో 73 సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 40 మంది మాత్రం అతికష్టం మీద సర్దుబాటు చేసినట్లు సమాచారం. మిగిలిన 33 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్దుబాటుకు సుముఖంగా లేని ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. తమకు అనుకూలమైన రాజకీయ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో డీఈఓపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. శుక్రవారం నిర్వహించిన ఓ సమావేశంలో డీఈఓ సైతం ఉపాధ్యాయులు తమకు కేటాయించిన పాఠశాలల్లో తప్పకుండా చేరాలని, చేరని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమస్యల భయంతో వెనకడుగు... ఉపాధ్యాయులు సర్దుబాటు ప్రక్రియను వ్యతిరేకించేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ప్రస్తుతం ఓ ప్రాంతంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన అయ్యవార్లకు ప్రభుత్వం నిర్ణయించిన కాలపరిమితి అనంతరమే బదిలీలు ఉంటాయి. అలా కాదని తమకు ఇష్టమైన ప్రదేశాలకు బదిలీ కోరితే అందుకు అనుమతించరు. అలాంటి తరుణంలో ప్రభుత్వం, విద్యాశాఖకు ఇష్టమైనప్పుడు మాత్రం ఇలాంటి పద్ధతికి తెర తీయడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జిల్లాలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ సర్దుబాటు ప్రక్రియ తాత్కాలికమే అని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. వివిధ పాఠశాలలకు సర్దుబాటు అయ్యే ఉపాధ్యాయులు 2018–19 విద్యా సంవత్సరం ముగిసేవరకు మాత్రమే ఆయా పాఠశాలల్లో కొనసాగుతారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తిరిగి గత పాఠశాలలకు వచ్చేస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం డీఎస్సీ ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై స్పష్టత కరువైంది. ఒక వేళ ఇప్పుడు నోటిఫికేషన్ వెలువరించినా.. పరీక్షల నిర్వహణ, ఉద్యోగాలకు ఎంపిక చేయాలంటే కనీసం ఆరు నెలల వ్యవధి తప్పనిసరి. తర్వాత కొద్ది కాలానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సర్దుబాటుకు వెళ్లిన ఉపాధ్యాయులు రెండేళ్ల పాటు తప్పనిసరిగా కొనసాగాల్సి అవసరం ఉంది. రవాణా ఖర్చులు సైతం తడిసి మోపెడు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న నివాసం నుంచి కేటాయించిన పాఠశాలకు వెళ్లాలంటే చార్జీల రూపంలో అదనపు ఖర్చులు తప్పవు. ఈ కారణాల దృష్ట్యా సర్దుబాటుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. ప్రమోషన్లు వస్తే పూర్వ స్కూల్‌కే... ఒక వేళ సీనియార్టీ ప్రకారం ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తే తాత్కాలిక ప్రాతిపదికన సర్దుబాటు అయిన ఉపాధ్యాయులు మధ్యలోనే వారు పనిచేసిన పూర్వ పాఠశాలలకు వచ్చేయాల్సి ఉంటుంది. లేదా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ కొలువులు భర్తీ చేస్తే సర్దుబాటు ప్రక్రియ ద్వారా వేర్వేరు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు గత పాఠశాలలకు రావాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన జారీ చేస్తే జిల్లాలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ కొలువుల్లో 30 శాతం మాత్రమే డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 70 శాతం ఉపాధ్యాయ కొలువులను పదోన్నతుల ద్వారా కల్పిస్తారు. ప్రస్తుతం ఈ రెండు పద్ధతులు అమలయ్యే సూచనలు ఇప్పట్లో అగుపించడం లేదు. ప్రశ్నార్థకంగా యూపీ పాఠశాలలు... విద్యార్థికి క్షేత్ర స్థాయిలో మెరుగైన విద్య అందితే ఉన్నత స్థాయిలో రాణించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత విద్యాశాఖ చర్యలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. క్షేత్ర స్థాయిలో బోధించే ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలలకు కేటాయిస్తే యూపీ పాఠశాలల్లో పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో సర్దుబాటు ప్రక్రియ ద్వారా ఉపాధ్యాలను నియమించడం కాకుండా ఆయా స్థానాల్లో విద్యావలంటీర్లను నియమించాలన్న డిమాండ్ నెలకొంది. దీని ద్వారా కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుపై దృష్టి పెట్టకుండా ఉపాధ్యాయులను ఇబ్బందులు పెట్టే ప్రక్రియకు ఉపక్రమించడం దారుణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
విద్యారంగాన్ని విస్మరించారు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు 40 వేలకుపైగా ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉంచుకుని, కనీస వసతులు లేని భవనాల్లో విద్యాసంస్థలను కొనసాగిస్తూ విద్యాప్రమాణాలను ఎలా మెరుగుపరుస్తారో ప్రభుత్వం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. అక్షరాస్యతలో దక్షిణ భారత దేశంలో చివరి స్థానంలో తెలంగాణ నిలిచిన విషయాన్ని విస్మరిస్తూ ప్రభుత్వ పాఠశాలలను ఏమాత్రం మెరుగుపరచకుండా చోద్యం చూస్తోందని విమర్శించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోనే గురుకుల పాఠశాలలు అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్భాటపు ప్రకటనలిస్తున్నారని ఎండగట్టారు. బుధవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రానురానూ తగ్గుతున్న వాస్తవాన్ని సర్కారు గుర్తించడం లేదన్నారు. ఉన్నత విద్య ఇంతకన్నా ఘోరంగా ఉందన్నారు. బోధన, బోధనేతర పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం, కనీస వసతుల కొరత వంటి సమస్యలతో వర్సిటీలు కునారిల్లుతున్నాయన్నారు. ఓడిపోతామన్న భయంతోనే పంచాయతీలకు పరోక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీలోనే కొనసాగుతారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
మెరిట్ కొడితే.. ఎక్కడైనా జాబ్
-
మెరిట్ కొడితే.. ఎక్కడైనా జాబ్
సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 31 జిల్లాలవారీగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 30 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. ఒకటి కంటే ఎక్కువ కేటగిరీ పోస్టులకు సంబంధించిన అర్హతలు ఉంటే అభ్యర్థులు ఆయా కేటగిరీ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాత పరీక్షలను ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల ఎంపికనుబట్టి రాత పరీక్ష తేదీలను ఖరారు చేస్తామన్నారు. వీలైతే ఫిబ్రవరి 8వ తేదీ నుంచి పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే వారు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగానే వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని జిల్లాల్లో 20 శాతం ఓపెన్ కోటా... ఇప్పటివరకు టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా ఎక్కువ పోస్టులు ఉన్న ఇతర జిల్లాల్లో 20 శాతం ఓపెన్ కోటాలో పోస్టుల కోసం ఆయా జిల్లాలకు వెళ్లి పరీక్ష రాయాల్సి వచ్చేది. దీంతో అభ్యర్థులు స్థానిక జిల్లాలో అవకాశాన్ని కోల్పోయే వారు. పైగా ఆ ఒక్క జిల్లాలో ఓపెన్ కోటాకే అర్హులయ్యే వారు. సొంత జిల్లాలోని పోస్టులకు పరీక్ష రాస్తే.. ఇతర జిల్లాలో 20 శాతం ఓపెన్ కోటాకు పరీక్ష రాసే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఆ ఆందోళన అవసరమే లేదు. ఎక్కడ పరీక్ష రాసినా.. సొంత జిల్లాతోపాటు మిగతా అన్ని జిల్లాల్లోని 20 శాతం ఓపెన్ కోటా పోస్టులకు ప్రతి ఒక్కరూ అర్హులే. అప్షన్ ఇచ్చుకుంటే చాలు.. రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా సొంత జిల్లాలోని పోస్టులతో పాటు మిగతా అన్ని జిల్లాల్లోని ఓపెన్ కోటా పోస్టులకు ఆ అభ్యర్థిని పరిగణనలోకి తీసుకుంటారు. మెరిట్ ఉంటే ఇతర జిల్లాల్లో ఎక్కడైనా పోస్టును పొందవచ్చు. గతంలో మాదిరి ఓపెన్ కోటా పోస్టుల కోసం సొంత జిల్లాలో వదులుకొని ఇతర జిల్లాలకు వెళ్లి పరీక్ష రాయాల్సిన అవసరమే లేదు. ఉదాహరణకు... వరంగల్ అర్బన్ జిల్లాలో 22 పోస్టులే ఉన్నాయి. అదే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 319 పోస్టులు ఉన్నాయి. అంటే అక్కడ ఓపెన్ కోటాలో దాదాపు 60 పోస్టులు ఉంటాయి. ఇలాంటప్పుడు వరంగల్ అర్బన్‌లోని 22 పోస్టుల్లో ఓపెన్ కోటాలో, లోకల్ కోటాలో పోస్టు రాకపోతే.. సదరు అభ్యర్థులు ఇచ్చే ఆప్షన్‌ను బట్టి అతని మెరిట్, రిజర్వేషన్ ప్రకారం ఇతర జిల్లాల్లోని ఓపెన్ కోటాలో ఎక్కడైనా పోస్టు వస్తుందా? పరిశీలించి.. వస్తే ఆ పోస్టుకు ఎంపిక చేస్తారు. టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ), లాంగ్వేజ్ పండిట్ (ఎల్పీ), సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసే వారు ఉపాధ్యాయ అర్హత పరీక్షలో (టెట్) అర్హత సాధించి ఉండాలి. నియామకాల్లో ఆ టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ, టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ) స్కోర్‌కు 80 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంపిక జాబితాను రూపొందిస్తారు. రాత పరీక్షను 80 మార్కులు 160 ప్రశ్నలతో నిర్వహిస్తారు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఖరారు చేసిన సిలబస్ మేరకు ప్రశ్నలు ఉంటాయి. కేటగిరీలవారీగా పోస్టులు, అర్హతలు, సిలబస్ వివరాలను (tspsc.gov.in,www.sakshieducation.com) వెబ్సైట్లలో పొందొచ్చు. సిలబస్ ప్రస్తుతం పదో తరగతి వరకు ఉన్న పాఠ్య పుస్తకాల ఆధారంగా రూపొందించారు. అయితే సైన్స్ మ్యాథ్స్ వంటి వాటిల్లో కొన్ని ఫార్ములాల్లో ఇంటర్మీడియట్ వరకు లింకేజీ ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున కేటాయిస్తారు. అన్ని కేటగిరీల పోస్టులకు ఒక్కొక్కటిగానే పరీక్ష ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ వంటి విధానం ఉండదు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ), స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులకు పూర్తిగా> రాత పరీక్ష ఆధారంగానే నియామకాలు ఉంటాయి. దీన్ని 100 మార్కులకు నిర్వహించే అవకాశం ఉంది. వాటికి టెట్‌లో అర్హత సాధించి ఉండాల్సిన అవసరం లేదు. 964 ఇంగ్లిష్ మీడియం పోస్టులు... రాష్ట్రంలో పలు పాఠశాలల్లో గతేడాది, ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టినందున ఈసారి ఇంగ్లిష్ మీడియం టీచర్ పోస్టులను కూడా భర్తీ చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం 964 ఇంగ్లిష్ మీడియం సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తోంది. ఏ మీడియం వారికి ఆ మీడియంలోనే రాత పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు వేర్వేరు మీడియంలలోని పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని అంశాలు... – ఎస్జీటీ పోస్టులకు 7వ తరగతి వరకు సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. – స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదో తరగతి వరకు సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. సైన్స్, మ్యాథ్స్‌లలోని కొన్ని ఫార్ములాల్లో ఇంటర్మీడియెట్ వరకు లింకేజీ ఉంటుంది. – ఒక అభ్యర్థి నిర్దేశిత అర్హతలు, సంబంధిత మెథడాలజీ ఉంటే ఆయా కేటగిరీలకు చెందిన పోస్టులన్నింటికీ వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. వేర్వేరు తేదీలు, సమయాల్లోనే రాత పరీక్షలు ఉంటాయి. – అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ. 80, ఆన్లైన్ ప్రాసెస్ కింద రూ. 200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు పరీక్ష ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. – గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు. దీనికి అదనంగా రిజర్వేషన్లు వర్తిస్తాయి. – ఉపాధ్యాయ నియామక నిబంధనలతో కూడిన ఉత్తర్వుల (జీవో 25) ప్రకారమే అర్హతలు ఉంటాయి. – నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నాటికి అర్హతలు పొంది ఉన్న వారే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇదీ పరీక్ష విధానం... విషయం మార్కులు ప్రశ్నలు జనరల్నాలెడ్జి, కరెంట్ ఎఫైర్స్ 10 20 పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10 20 సంబంధిత సబ్జెక్టు(భాష, ఇంగ్లిషు తదిరాలు) 60 120 ఇవీ కేటగిరీలవారీగా పోస్టులు.. స్కూల్ అసిస్టెంట్ – 1941 పీఈటీ – 416 స్కూల్‌అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) – 9 లాంగ్వేజ్ పండిట్ – 1011 సెకండరీ గ్రేడ్ టీచర్ – 5415 మొత్తం – 8,792 మీడియంవారీగా పోస్టులు... ఇంగ్లిష్ – 964 హిందీ – 516 ఉర్దూ – 900 తెలుగు – 6,303 + 9 (ఫిజికల్ డైరెక్టర్) కన్నడ – 31 మరాఠీ – 53 తమిళం – 5 బెంగాలీ – 11 -
ఉపాధ్యాయుల పోస్టులకు నోటిఫికేషన్ సిద్దం
-
టీచర్ పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అవసరమైన టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ) నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. నేడు నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. నేడు జరిగే కమిషన్ సమావేశంలో చర్చించిన తర్వాత నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. సిలబస్, అర్హతలు, పోస్టులు, రోస్టర్ తదితర అంశాలన్నింటినీ శుక్రవారం ఖరారు చేసినట్లు తెలిసింది. దీంతో శనివారం మధ్యాహ్నం తర్వాత నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో మొదట 8,792 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిసింది. సోమవారం టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన కేసు విచారణకు రానున్నందున సుప్రీంకోర్టుకు ఈ నోటిఫికేషన్ కాపీని అందజేయనున్నట్లు సమాచారం. ఇంగ్లిషు తప్పనిసరి నేపథ్యంలో.. ఈ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా 500 వరకు ఇంగ్లిషు మీడియం సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంగ్లిషు సబ్జెక్టును తప్పనిసరి చేయడంతోపాటు ప్రీప్రైమరీ దశలోనూ ఇంగ్లిషు మీడియం ప్రారంభించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గతేడాది, ఈసారి కలిపి దాదాపు 8 లక్షల మంది వరకు ఇంగ్లిషు మీడియంలో చేరారు. వారికి బో«ధించేందుకు ఇంగ్లిషు మీడియం పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. -
నిరుద్యోగులకు మరో తీపికబురు!
హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. టీచర్ పోస్టుల కోసం వేలకళ్లతో ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందించింది. 15 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీచేస్తామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా 8,792 ఉపాధ్యాయ కొలువును భర్తీ చేస్తామని తెలిపారు. డీఎస్సీకి ఇకపై టెట్ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మళ్లీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను నిర్వహించబోమని చెప్పారు. టీచర్ల బదిలీలు కూడా ఉండబోవని అన్నారు. పాత జిల్లాల మేరకే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. -
విద్యా వలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్
- తొలుత 9,335 పోస్టుల్లో నియామకానికి చర్యలు - తరువాత మరో 2 వేలకుపైగా భర్తీకి నిర్ణయం - శ్రీనివాస ప్రాంతానికి చెందిన వారికే ప్రాధాన్యం - మెరిట్ ప్రకారం నియామకాలు.. టెట్ స్కోర్‌కు 20% వెయిటేజీ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో విద్యా వలంటీర్ల నియామకం కోసం జిల్లా విద్యాశాఖ కార్యాలయాలు బుధవారం నోటిఫికేషన్లు జారీ చేశాయి. పాఠశాల విద్యా డైరెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 9,335 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు జిల్లాల చెందిన విద్యాశాఖ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకుని సంబంధిత మండల విద్యాధికారుల (ఎంఈవోల)కు అందజేయాలి. దరఖాస్తులను పరిశీలించి మండలాల వారీగా మెరిట్ జాబితాలను రూపొందించి నియామకాలు చేపడతారు. ఈనెల 16వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 20వ తేదీ వరకు విద్యా వలంటీర్ల సేవలు వినియోగించుకుంటారు. వారికి నెలకు రూ.8 వేల గౌరవ వేతనం అందజేస్తారు. మార్గదర్శకాలివీ.. విద్యా వలంటీర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారికి ఈనెల 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నుంచి 44 ఏళ్లలోపు వయసు ఉండాలి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో అర్హత సాధించిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటే జీ ఇస్తారు. మండలాల వారీగా రోస్టర్ పాయింట్లను కేటాయించి, మెరిట్ జాబితాలను రూపొందించాలి. నియామకాల సమయంలో మాత్రం ఆయా నివాస ప్రాంతానికి చెందిన వారికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ గ్రామానికి చెందిన వారు అందుబాటులో లేకపోతే పక్క గ్రామానికి చెందిన వారిని నియమిస్తారు. సంబంధిత గ్రామంలో, పక్క గ్రామంలో అర్హులైన అభ్యర్థులు లేకపోతే మండలం మెరిట్ జాబితాలోని జనరల్ లిస్టు నుంచి అభ్యర్థులను నియమిస్తారు. ఆ మండలంలో అభ్యర్థులు లేకపోతే పక్క మండ లానికి చెందిన వారిని నియమిస్తారు. ఇక విద్యా వలంటీర్‌గా నియమితులయ్యేవారు ఆ గ్రామంలోనే ఉండి బోధన చేపడతామని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీతో ఒప్పందం చేసుకోవాలని, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ నియామకాలకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవ హరించే జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నియామకాలను ఈనెల 15లోగా పూర్తి చేయాలని, 16వ తేదీ నుంచి విద్యా వలంటీర్లు పాఠశాల్లో బోధించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతమున్న ఖాళీలను విద్యా వలంటీర్లతో భర్తీ చేస్తున్నా.. పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య, అవసరాల ఆధారంగా త్వరలోనే మరో 2 వేలకుపైగా విద్యా వలంటీర్లను నియమించేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. -
2,544 టీచర్ పోస్టుల భర్తీ
* గిరిజన విద్యాసంస్థల్లో ఖాళీలపై ప్రభుత్వం నిర్ణయం * మంత్రి చందూలాల్ వెల్లడి * విద్యా సంస్థల్లో వసతులకు రూ.200 కోట్లు కేటాయింపు * రూ.40 కోట్లతో స్కాలర్షిప్లు సాక్షి, హైదరాబాద్: గిరిజన విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న 2,544 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు గిరిజనసంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. ఈ విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాలు, సౌకర్యాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో రూ.200 కోట్లు వెచ్చించి బయోమెట్రిక్ పరికరాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, విద్యార్థులకు మౌలిక వసతులు, క్రీడాపరికరాలు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. సోమవారం సంక్షేమ భవన్లో గిరిజన విద్యాసంస్థల్లో నూతన విద్యావిధానంపై ఆయన రాష్ర్టస్థాయి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల్లో డ్రాపవుట్స్ లేకుండా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలకోసం రూ.7.45 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. 5-8 తరగతుల మధ్య చదువుతున్న విద్యార్థుల శాతాన్ని పెంచేందుకు రూ.40 కోట్ల మేర స్కాలర్‌షిప్‌ల రూపంలో అందించాలని నిర్ణయించామన్నారు. ఈ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేందుకు మంచినీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సున్నా ఫలితాలు వచ్చే పాఠశాలల టీచర్లపై చర్యలు... కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా గిరిజన విద్యాసంస్థల్లో సౌకర్యాలను కల్పిస్తున్నామని, అందుకు అనుగుణంగా అత్యుత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. బోధనలో మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులకూ పునశ్చరణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో సున్నాశాతం ఫలితాలు వచ్చే పాఠశాలల ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలోని ఫలితాలను దృష్టిలో పెట్టుకుని గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి చందూలాల్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్టీ సంక్షేమశాఖ కమిషనర్ మహేశ్‌దత్ ఎక్కా, ఐటీడీఏ పీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. నూతన విద్యావిధానంపై నిపుణుల సూచనలు కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ ప్రతిపాదిస్తున్న నూతన విద్యావిధానంపై పాఠశాల విద్యకు సంబంధించిన 13 అంశాలు, ఉన్నతవిద్యకు సంబంధించిన 20 అంశాలపై సోమవారం సంక్షేమ భవన్లో వర్క్‌షాపును నిర్వహించారు. ఆయా విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, సెస్ డెరైక్టర్, సర్వశిక్ష అభియాన్ అధికారులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, గిరిజనసంఘాల నాయకులు ఇందులో పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సంద ర్భంగా మంత్రి చందూలాల్ మాట్లాడుతూ ప్రతి గిరిజన విద్యార్థి సమగ్రాభివృద్ధికి ఉపయోగపడేలా సూచనలు చేయాలని నిపుణులను కోరారు. ఈ వర్క్‌షాపులో నిపుణులు ఇచ్చే సూచనలు,సలహాలను కేంద్రప్రభుత్వపరిశీలనకు పంపిస్తామని గిరిజనసంక్షేమశాఖ కమిషనర్ మహేశ్‌దత్ ఎక్కా తెలిపారు. -
ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి
వైఎస్సార్సీపీ తెలంగాణ యువజన విభాగం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఖాళీగా ఉన్న 25 వేల ప్రభుత్వ ఉపాధ్యాయపోస్టులను భర్తీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్ డిమాండ్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రేషనలైజేషన్‌తో సంబంధం లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అవుతున్నా హస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచలేదని పేర్కొన్నారు. ఆనాడు దివంగత సీఎం వైఎస్సార్ విద్యా శాఖకు ఇచ్చిన నిధులను ఒక ఖర్చుగా చూడలేదన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. -
ఎన్నటికి సర్దుతారో?
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల కొరతను తీర్చడంలో భాగంగా ‘పని సర్దుబాటు’ ఆదేశాలను ప్రభుత్వం హడావుడిగా ప్రకటించింది, అయితే ఈ ప్రకటన వెలువడి నెలరోజుల దాటినా జిల్లాలో సర్దుబాటు ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. ఎంఈఓల బాధ్యతారాహిత్యం కారణంగా టీచర్ల మిగులు, ఖాళీల జాబితాను పలుమార్లు పరిశీలించాల్సి రావడంతో ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. రేషనలైజేషన్ నిబంధనల ప్రకారం..పాఠశాలల్లో మిగులుగా ఉన్న ఉపాధ్యాయులను గుర్తించి అవసరమున్న పాఠశాలకు పంపే విధంగా సర్దుబాటు చేయాలి. నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుల నివేదికను జిల్లా కేంద్రంలోనే విద్యాశాఖ తయారుచేసి సర్దుబాటు కౌన్సెలింగ్‌ను జిల్లాస్థాయిలో చేపట్టాలి. అయితే ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ మేరకు సర్దుబాటు ప్రక్రియను మండలపరిధికి కుదించారు. ఈ నేపథ్యంలో టీచర్ల నివేదిక కోసం విద్యాశాఖ ఎంఈఓలపై ఆధారపడింది. మండలస్థాయిలో సర్దుబాటు నివేదికలను ఎంఈఓలు జిల్లా విద్యాశాఖకు పంపాలి. రేషనలైజేషన్, సర్దుబాటుకు సంబంధించిన మార్గదర్శకాలపై ఎంఈఓలకు సరైన అవగాహన లేక టీచర్ల నివేదికను ఇష్టానుసారం తప్పులతడకలతో పంపారు. దీంతో ఆ నివేదికలను పలుమార్లు వెనక్కి పంపాల్సి రావడంతో సర్దుబాటు ప్రక్రియ జాప్యమవుతోందని విద్యాశాఖ చెబుతోంది. ఇష్టానుసారం ఎంఈఓల నివేదికలు రేషనలైజేషన్ జీఓ పరిపూర్ణంగా అమలు చేస్తే ఖాళీలున్న అన్ని స్థానాలకు టీచర్లను బదిలీ చేయడానికి వీలులేదు. డీఎస్సీ కోసం ఉంచిన పోస్టులు, ఉద్యోగోన్నతుల కారణంగా ఖాళీ అయిన పోస్టులను మినహాయించి బదిలీ కౌన్సెలింగ్‌కు చూపించాలి. తాజాగా అమలు చేయాల్సిన సర్దుబాటు ప్రక్రియ కోసం రేషనలైజేషన్ జీఓ ఒకవైపు అమలు చేస్తూ మిగులు ఉపాధ్యాయులను మాత్రమే గుర్తించాలి. కానీ సర్దుబాటు అవసరమున్న పాఠశాలలను గుర్తించడంలో రేషనలైజేషన్ జీఓను పరిగణనలోకి తీసుకోకుండా విద్యార్థుల సంఖ్యకు ప్రాధాన్యం ఇచ్చి అధికంగా ఉన్న ప్రతి పాఠశాలకు టీచర్‌ను సర్దుబాటు చేయాలి. ఈ విద్యాసంవత్సరం చివరి పనిదినం వరకు సర్దుబాటు చేసిన పాఠశాలల్లో పనిచేసి ఆఖరి రోజున ఉపాధ్యాయులు తిరిగి తమ మాతృపాఠశాలలో చేరాల్సి ఉంటుంది. అయితే ఈ విధానాన్ని అమలు చేయకుండా తప్పుడు ఖాళీల జాబితా నివేదికలు పలు మండలాల నుంచి జిల్లా విద్యాశాఖకు వచ్చాయి. వీటిని సరిదిద్దడానికి వారం రోజులు పట్టినట్లు తెలుస్తోంది. సర్దుబాటు మార్గదర్శకాలపై ఎంఈఓలు అవగాహన కల్పించుకోకపోవడం వల్లనే ఈ జాప్యం అనివార్యమైందని ఉపాధ్యాయ వర్గాలు అరోపిస్తున్నాయి. జాబితా పరిశీలనలో ఉంది ‘జిల్లాలో టీచర్ల పనిసర్దుబాటు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఎంఈఓల నుంచి వచ్చిన టీచర్ల మిగులు, ఖాళీల జాబితా పరిశీలనలో ఉంది. సర్దుబాటు మార్గదర్శకాలను సక్రమంగా అమలు చేయడానికి వీలుగా ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తున్నాం. రెండు మూడు రోజుల్లో సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేస్తాం’. జిల్లా విద్యాశాఖాధికారి, జి. కృష్ణారావు, విజయనగరం. -
టీచర్ పరీక్షలకు ప్రత్యేక సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల నియామక పరీక్షలకు ప్రత్యేక సిలబస్‌ను పెడుతున్నామని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.ఉషారాణి పేర్కొన్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ నియామక పరీక్ష రెండింటినీ కలిపి ఒకే పరీక్షగా నిర్వహిస్తున్నందున ప్రత్యేక సిలబస్‌ను అనుసరిస్తామని ఆమె బుధవారం ‘సాక్షి’కి వివరించారు. ఈ సిలబస్ అంశాలను త్వరలోనే తమ శాఖ వెబ్సైట్లో ప్రకటిస్తామన్నారు. ఈసారి టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసే వారిలో వివిధ సబ్జెక్టుల్లో నైపుణ్యాన్ని అంచనా వేయడంతో పాటు బోధనాపద్ధతులు, పాఠశాల నిర్వహణలోని మెలకువలను కూడా అంచనా వేస్తామని చెప్పారు. గతంలో టెట్, డీఎస్సీ ఉన్నప్పుడు వేర్వేరుగా సిలబస్‌ను అనుసరించి ప్రశ్నలు రూపొందించి ఇచ్చేవారని.. ఇప్పుడు ఒక్కటే పరీక్ష అయినందున పాత సిలబస్ కాకుండా ప్రత్యేక సిలబస్‌ను ప్రకటిస్తామని తెలిపారు. ఆర్థికశాఖ నుంచి అనుమతి వచ్చిన మేరకు 9,061 పోస్టులను భర్తీచేస్తున్నామని, ఆ సంఖ్య మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలను రోస్టర్ పద్ధతిలో తెప్పిస్తున్నామన్నారు. టెట్ రాసినవారికి 20 శాతం వెయిటేజీ... గతంలో టెట్ పరీక్షలో అర్హులైన వారికి ఈసారి పరీక్షలో 20 శాతం మార్కులు వెయిటేజీగా ఇవ్వనున్నామని ఉషారాణి స్పష్టంచేశారు. వెయిటేజీ విషయంలో వ్యక్తమవుతున్న సందేహాలపై ఆమె స్పందిస్తూ.. న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా ఉండేందుకే ఈ వెయిటేజీ నిర్ణయాన్ని తీసుకున్నామని వివరించారు. గతంలో టెట్ రాసిన వారికి వారు సాధించిన మార్కులను అనుసరించి ఆ తరువాత జరిగే డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఇచ్చేవారమని తెలిపారు. అదే విధానం ఇప్పుడూ కొనసాగుతుందన్నారు. ఈ 20 శాతం వెయిటేజీ అయితే గతంలో టెట్‌లో వచ్చిన మార్కులు, ఇప్పుడు వచ్చిన మార్కులలో ఏది ఎక్కువగా ఉంటే దానినే కలుపుతామన్నారు. ‘‘ఉదాహరణకు గతంలో టెట్ రాసిన అభ్యర్థికి వందకు 60 మార్కులు వచ్చి ఉంటే అందులో 20 శాతం అంటే 12 మార్కుల మేరకు తదుపరి డీఎస్సీలో వెయిటేజీ ఉండేది. ఇపుడు టెట్, టెర్ట్ కలసి 200 మార్కులకు పెడుతున్నాం. ఇందులో ఆ అభ్యర్థికి 80 మార్కులు వస్తే గతంలోని వెయిటేజీ ప్రకారం 20 శాతం అంటే 16 మార్కులు ఉంటుంది. గతంలోని వెయిటేజీ 12 కన్నా ఇపుడు 4 మార్కులు ఎక్కువ వెయిటేజీ వచ్చినందున ఆ అభ్యర్థికి వచ్చిన 80 మార్కులకు 4 మార్కులు కలిపి 84 మార్కులు సాధించినట్లుగా పరిగణిస్తాం’’ అని వివరించారు. మునిసిపల్ పాఠశాలల్లోని 1,250 టీచర్ల పోస్టులను ఈ డీఎస్సీలోనే కలిపి భర్తీచేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
విద్యాబోధకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు అవసరమైన 220 విద్యాబోధకుల నియామకానికై అర్హులైన అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తు చేయాలని రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి తన్నీరు శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. పాఠశాలల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో ఉండి ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్న 24 మండలాల్లోని పాఠశాలల్లో విద్యా బోధకులను నియమించనున్నట్లు తెలిపారు. డిగ్రీ-బీఈడీ, ఇంటర్-టీటీసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతో ఆయా మండల విద్యాశాఖాధికారులకు దరఖాస్తు చేయాలని సూచించారు. మండలాల వారీగా అమరావతి- 2, కాకుమాను- 7, గురజాల- 8, అచ్చంపేట- 15, మాచర్ల- 9, నూజెండ్ల- 14, రెంటచింతల- 19, నిజాంపట్నం- 7, నగరం- 12, మాచవరం- 13, శావల్యాపురం- 6, దుర్గి- 7, పెదనందిపాడు- 7, బెల్లంకొండ- 4, వెల్ధుర్తి- 4, రాజుపాలెం- 17, తాడికొండ- 7, పిట్టలవానిపాలెం- 6, మేడికొండూరు- 10, ఈపూరు- 8, బొల్లాపల్లి- 19- దాచేపల్లి- 5, పెదకూరపాడు- 7, నకరికల్లు- 7 పోస్టులను భర్తీ చేయనున్నామని వివరించారు. పూర్తి వివరాలకు టట్చజఠ్టఠట.జీ వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు. -
ఏజెన్సీ డీఎస్సీకి లైన్ క్లియర్
భద్రాచలం, న్యూస్‌లైన్ : ఏజెన్సీ డీఎస్సీకి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. 2012 నోటిఫికేషన్ ద్వారా గుర్తించిన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసుకోవచ్చని కోర్టు నుంచి ఉత్తర్వులు అందడంతో ఐటీడీఏ అధికారులు ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఐటీడీఏ పరిధిలో గల పాఠశాలల్లో 370 ఎస్జీటీ, 182 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం 2012లో స్పెషల్ డీఎస్సీ పేరిట నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలోని భద్రాచలం ఏజెన్సీలో 493 పోస్టులకు అనుమతి వచ్చింది. అయితే మిగతా జిల్లాల్లో ఉపాధ్యాయుల ఎంపిక పూర్తి అయినప్పటికీ భద్రాచలం ఐటీడీఏ పరిధిలో మాత్రం కోర్టు కేసుల వివాదాలతో భర్తీప్రక్రియ నిలిచిపోయింది. డీ ఎస్సీకి దరఖాస్తు చేసుకున్న పలువురు లంబాడా అభ్యర్థులు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వారు కాదని ఆదివాసీ అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై కోర్టును సైతం అశ్రయించారు. దీంతో ఉపాధ్యాయల ఎంపిక ప్రక్రియ ముందుకు సాగలేదు. దీనిపై ఏడాదికి పైగా కోర్టులో వాదనలు జరిగాయి. లంబాడా అభ్యర్థులు సమర్పించిన ఏజెన్సీ సర్టిఫికెట్లు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఐటీడీఏ అధికారులు కోర్టుకు నివేదించారు. ఇందుకు సమ్మంతించిన కోర్టు పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఇప్పటికే ప్రకటించిన జాబితా ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 11న ఐటీడీఏ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ సరస్వతి తెలిపారు. తేలని పీఈటీల పంచాయితీ... ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆమోదం లభించినప్పటికీ పీఈటీ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం లేకుండా పోతోంది. 41 పీఈటీ పోస్టుల భర్తీకి ఐటీడీఏ అధికారులు దరఖాస్తులు ఆహ్వానించి అర్హుల జాబితా కూడా ప్రకటించారు. అయితే పీఈటీ ఉద్యోగాలకు ఐటీడీఏ అధికారులు ప్రకటించిన జాబితాలో కొందరు నకి లీ సర్టిఫికెట్లు జతచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆదివాసీ తెగకు చెందిన అభ్యర్థులు సమాచార హక్కు చట్టం ద్వారా ఎంపికైన అభ్యర్థుల మార్కుల జాబితాలను యూనివర్శిటీ నుంచి తెప్పించి ఐటీడీఏ అధికారులకు అందజేయటంతో అవి నకిలీవిగా తేలాయి. వారిని తొలగించి మరో సారి జాబితా ప్రకటించినప్పటికీ అందులో కూడా కొన్ని అభ్యంతరాలను లేవనెత్తిన ఆదివాసీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై తుది నిర్ణయాన్ని కోర్టు పెండింగ్‌లో పెట్టడంతో పీఈటీ పోస్టుల భర్తీకి ఆమోదం లభించలేదు.