నిరుద్యోగులకు మరో తీపికబురు! | telangana govt issues DSC notification | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు మరో తీపికబురు!

Published Wed, May 3 2017 5:22 PM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

నిరుద్యోగులకు మరో తీపికబురు! - Sakshi

నిరుద్యోగులకు మరో తీపికబురు!

హైదరాబాద్‌: రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. టీచర్‌ పోస్టుల కోసం వేలకళ్లతో ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందించింది. 15 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీచేస్తామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా 8,792 ఉపాధ్యాయ కొలువును భర్తీ చేస్తామని తెలిపారు. డీఎస్సీకి ఇకపై టెట్‌ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మళ్లీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను నిర్వహించబోమని చెప్పారు. టీచర్ల బదిలీలు కూడా ఉండబోవని అన్నారు.  పాత జిల్లాల మేరకే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement