
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి బుధవారం కలిశారు. రాయలసీమ కరువు నివారణ పథకం, వైయస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్రమంత్రిని కోరారు. రాయలసీమ కరువు నివారణ పథకానికి ఎలక్ట్రికల్ మెకానికల్ కాంపోనెంట్ కింద రూ. 12,012 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వైయస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు ఎలక్ట్రో మెకానికల్ కాంపోనెంట్ కింద రూ.3,008 రూపాయలు రుణంగా ఇవ్వాలని కూడా విజయసాయి రెడ్డి విన్నవించారు. ఈ రెండు ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పీఎఫ్‌సీ, ఆర్ఏసీలు రుణం అందించేందుకు ఆదేశాలు ఇవ్వాలని విజయసాయి రెడ్డి ఆర్‌కే సింగ్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment