సెప్టెంబర్‌ 25న ప్రధాని కీలక ప్రకటన | Prime Minister Narendra Modi is likely to make a major announcement on power sector on September 25, according to MoS for Power RK Singh. | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 23 2017 8:38 PM | Last Updated on Wed, Aug 15 2018 7:07 PM

Prime Minister Narendra Modi is likely to make a major announcement on power sector on September 25, according to MoS for Power RK Singh.

సాక్షి, న్యూఢిల్లీ:   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబరు 25 న విద్యుత్ రంగంపై పెద్ద ప్రకటన చేయనున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆర్.కె. సింగ్  చెప్పారు.  సీన్‌బీసీటీవీ 18 ఇంటర్వూలో  మంత్రి ఈ   వ్యాఖ్యలు చేశారు.

సెప్టెంబర్ 25 న ప్రధానమంత్రి  విద్యుత్ రంగంపై కీలక ప్రకటన చేయనున్నారు. ఈ విషయంలో  మేము చాలా సంతోషిస్తున్నాం,  ఇది ప్రజలకు చాలా ముఖ్యమైనదని  సింగ్‌  పేర్కొన్నారు.    కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి  ఇంటర్వ్యూలో ఆయన ఈ ప్రకటన చేశారు.  ముఖ్యంగా విద్యుత్‌ రంగంలో ప్రయివేటు ప్లేయర్స్‌  మరింత ప్రాధ్యాన త ఉంటుందనికానీ,  కంటెంట్"  క్యారేజ్‌ వేరు  చేస్తానని హామీ  ఇచ్చారు. అంతేకాదు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పిపిఎలు) గౌరవిస్తూ చట్టపరమైన మార్పులను చేయనున్నామని ఆయన తెలిపారు.  ఆ ఒప్పందాలకు పభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు.

సెప్టెంబర్ 25 న బిజెపి జాతీయ కార్యనిర్వాహక కార్యకర్తలను మోదీ ప్రసంగించనున్నారు.  దీన్ని దూరదర్శన్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.  దేశ ఆర్ధిక మాంద్యం మీద ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ ప్రసంగం ప్రాధాన‍్యతను సంతరించుకుంది.  ప్రభుత్వ వర్గాల ప్రకారం  సెప్టెంబరు 25 ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక  కర్త దీనదయాల్ వార్షికోత్సవం  సందర్భంగాపవర్‌ ఫర్‌ ఆల్‌పథకాన్ని లాంచ్‌ చేయనుంది.  'సౌభాగ్యా' పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించనుంది.   ట్రాన్స్‌ఫార్మర్లు, మీటర్లు ,  వైర్లపై  సబ్సిడీ ఇవ్వనుందని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement