సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం పవర్‌హౌజ్ ప్రమాద ఘటనపై కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి రాజ్‌కుమార్ సింగ్(ఆర్కే సింగ్) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంస్థ భవిష్యత్తు కోసం ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ శుక్రవారం కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్‌ను కలిశారు. ఈ సందర్బంగా శ్రీశైల ప్రమాద ఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన ఆర్కే సింగ్.. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సిఈఏ) ద్వారా విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని హైడ్రల్ పవర్ ప్రాజెక్టులను ఆడిట్ చేసి భద్రతా లోపాలపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. (చదవండి: శ్రీశైలం ప్రమాదం: ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు)
కాగా ఆగస్టు 20న శ్రీశైలం పవర్ హౌజ్‌లో ప్రమాదం జరిగిన విషయం విదితమే. అధికారులు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. హైడ్రో పవర్ టన్నెల్‌లో పని జరుగుతున్న సమయంలో సడన్‌గా మెషీన్‌లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏఈ, డిఈ , ఏఏఈ లతో పాటు మొత్తం 9 మంది సిబ్బంది మృతి చెందారు. (చదవండి: శ్రీశైలం అగ్ని ప్రమాదంలో కొత్త కోణం)
Comments
Please login to add a commentAdd a comment