'భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్ వద్దు' | BJP MP opposes India-Pakistan cricket series in Lok Sabha | Sakshi
Sakshi News home page

'భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్ వద్దు'

Published Mon, May 11 2015 7:08 PM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

BJP MP opposes India-Pakistan cricket series in Lok Sabha

న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్ను బీజేపీ ఎంపీ వ్యతిరేకిస్తున్నారు. మన దేశంపై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు ఆశ్రయిస్తున్న పాకిస్థాన్తో క్రికెట్ ఆడటం ఏంటని అభ్యంతరం చెప్పారు. వచ్చే డిసెంబర్లో భారత్-పాక్ క్రికెట్ సిరీస్ నిర్వహణకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో బీజేపీ ఎంపీలు ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించారు. ఈ విషయంపై పునరాలోచించుకోవాలని బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ ప్రభుత్వాన్ని కోరారు. దావూద్ ఇబ్రహీంకు పాక్ ఆశ్రయమిస్తోందని, ముంబై ఉగ్రవాద దాడుల్లో ఆ దేశం ప్రమేయముందని అన్నారు. 26/11 ముందై దాడుల అనంతరం ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాలు దెబ్బతిన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement