మణుగూరు రూరల్: విద్యుత్ సెక్టార్‌ను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టివే సిందని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. విద్యుత్ కొనుగోలుకు రూ.30,406 కోట్లు, బకాయిల పేరుతో రూ.59,580 కోట్లు అప్పు చేసి లెక్కలు లేకుండా తారుమారు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన ధ్వజమెత్తారు.
భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను శనివారం భట్టి సందర్శించారు. జెన్‌కో అధికారులతో కలిసి వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యుత్ ఉత్పత్తి వివరాల గురించి అడిగి తెలుసుకు న్నారు. అనంతరం సీఈ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు.
బీటీపీఎస్‌తో వచ్చే సమస్యలు అధిగమించేందుకు..
ప్రస్తుతం బీటీపీఎస్‌తో అనేక సమస్యలు తలె త్తుతున్న క్రమంలో వాటిని అధిగమించేందుకు భవిష్యత్‌లో ఉన్నత మైన ప్రణాళికలు రూపొందిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. బీటీపీ ఎస్‌లో సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సి ఉండగా.. సబ్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే వినియోగిస్తున్నా రని, దీంతో పర్యావర ణానికి అనేక సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ఈ సమస్య లను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.
అనంతరం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. జమలాపురం ఆలయాన్ని, మామునూరు పేట చెరువు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, రేమిడిచర్లలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మిస్తామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో జెన్‌కో సీఎండీ సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి కృష్ణభాస్కర్, పినపాక, వైరా ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ నాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment