భద్రాద్రి కొత్తగూడెం: విద్యుత్ కొనుగోలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.59 వేల కోట్ల బకాలున్నాయని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన శనివారం భద్రాది థర్మల్ ప్రాజెక్టును సందర్శించారు. స్వయంగా ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమతోనే కరెంట్ అని చెప్పిన గత ప్రభుత్వానికి చెందినవారు భారీగా అప్పలు చేశారని మండిపడ్డారు. సింగరేణికి రూ.19వేల కోట్లు బకాయి పడ్డారని తెలిపారు.
అన్ని శాఖల్లో గత ప్రభుత్వం అప్పులు చేసి ఆందోళనకర పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని నెట్టివేసిందని భట్టి విక్రమార్క అన్నారు. అందుకే వాస్తవ విషయాలు అసెంబ్లీలో శ్వేతపత్రం రూపంలో తాము చెప్పడానికి ప్రయత్నం చేశామని తెలిపారు. ఇదేవిధంగా అన్ని ప్రాజెక్టులను సందర్శించి వాటిపై కూడా సమగ్రమైన సమాచారం సేకరించి ప్రజల ముందుకు తీసకువస్తామని వెల్లడించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 81,514 కోట్ల అప్పులు చేసిందని అన్నారు. ప్రభుత్వం నుంచి డిస్కంలకు 28వేల కోట్ల బకాయి పడి ఉన్నామని తెలిపారు. తాము ఉంటేనే కరెంట్ సాధ్యం అని చెప్పిన గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందని మండిపడ్డారు.
యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు రూ. 50,000 కోట్ల అప్పు ఉందని అన్నారు. అప్పుల నుంచి విముక్తులై గాడిలో పెట్టడానికి రివ్యూ చేస్తూ ప్రయత్నం చేస్తున్నాని తెలిపారు.ఇవన్నీ గాలి లెక్కలు కాదని.. ఉన్నరికార్డ్స్ ప్రకారం మీకు అందిస్తున్నామని చెప్పారు.గత ప్రభుత్వం పవర్ సెక్టార్‌ను పీకలదాకా ముంచేసిందని మండిపడ్డారు.తమ ప్రభుత్వం ఈ అప్పుల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తోందని అన్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడుకొని పర్యావరణానికి హని కలుగకుండా మేధావుల సూచనల మేరకు ముందుకు వెళ్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment