అగ్ని ప్రమాదంలో దగ్ధమైన రెండు పోర్షన్ల పూరిల్లు
పమిడిముక్కల (పామర్రు) : ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు పోర్షన్ల పూరిల్లు కాలి బూడిదైంది. ఈ ఘటన పెళ్లి ఇంట తీవ్ర బాధను మిగి ల్చింది. సేకరించిన వివరాల ప్రకారం, మండలంలోని తాడంకి కొత్త స్థలాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఏర్పడిన నిప్పు రవ్వల కారణంగా ఆదివారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పుట్టి కనకమ్మ, పుట్టి శివగంగ నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే అంటుకున్న మంటకు వీచిన ఈదురుగాలులు తోడవ్వడంతో అగ్నికీలలు ఇంటి మొత్తాన్ని చుట్టుముట్టాయి. నిద్రలో ఉన్న కనకమ్మ ఒక్కసారిగా లేచి చూసేసరికి నట్టింటికి మం టలు తాకాయి. దీంతో భయాందోళనతో తన కోడలు శివగంగ, మనుమరా లిని నిద్ర లేపి బయటకు పరుగులు తీశారు. కేకలు వేయగా స్థానికులంతా గుమ్మిగూడి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సి బ్బంది తీవ్రంగా శ్రమించి మంటలు వ్యాపించకుండా అదుపు చేయగలిగా రు. అప్పటికే ఇంటితో పాటు వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి.
ఈ నెల 11న వివాహ వేడుక..
భర్త తోడులేని శివగంగ తన కుమార్తెకు ఈ నెల 11వ తేదీన వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అత్త కనకమ్మతో కలిసి పూరింటిని ముస్తాబు చేసుకుంది. పెళ్లి కోసమని అత్తాకోడళ్లు రూ.65 వేలు కూడ బెట్టుకుని దాచుకున్నారు. పెళ్లి బట్టలు రెండు రోజుల క్రితమే కొని ఇంట్లో భద్రపరిచారు. అగ్ని ప్రమాదంలో ఆ నగదు, బట్టలు కాలి బూడిదయ్యాయి. సర్వం పోగొట్టుకుని ఎలా పెళ్లి చేయాలా అని ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. స్థానికులు సైతం కలత చెంది కుటుంబ సభ్యులను ఓదార్చారు. రెవెన్యూ అధికారులు వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment