
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లలో పొదుపు చేస్తూ, వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేస్తూ రాష్ట్ర విద్యుత్ రంగం ముందుకు దూసుకెళ్తోంది. ఫోర్ కాస్టింగ్ మోడల్ కృత్రిమ మేధస్సు(ఏఐ) ద్వారా సత్ఫలితాలను సాధిస్తోంది. ఏపీ ట్రాన్స్‌కోలోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఎల్‌డీసీ) విద్యుత్ డిమాండ్, వినియోగాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి దీన్ని వినియోగిస్తోంది. ఇది మరుసటి రోజు విద్యుత్ వినియోగాన్ని ముందే అంచనా వేస్తుంది. ప్రతి 15 నిమిషాలకొకసారి రోజువారీ విద్యుత్ డిమాండ్‌ను తెలియజేస్తుంది. విద్యుత్ డిమాండ్, సరఫరా, గ్రిడ్ నిర్వహణ, విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గించడం తదితర నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోందని అధికారులు చెబుతున్నారు. పవన శక్తి, సౌర శక్తి, మార్కెట్ ధరలు, కేంద్ర ఉత్పత్తి స్టేషన్ల మిగులు, ఫ్రీక్వెన్సీ తదితరాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతోందని వివరించారు. విద్యుత్ చౌర్యం, బిల్లింగ్, బిల్లుల సేకరణలో అవినీతిని కూడా అరికడుతుందని తెలిపారు.
తగ్గుతున్న కొనుగోలు ఖర్చు..
కృత్రిమ మేధస్సు అందుబాటులోకి వచ్చిన తర్వాత విద్యుత్ సంస్థలు కొనుగోలు ఖర్చును తగ్గించుకోగలుగుతున్నాయి. 2019–20, 2020–21లో ఉత్తమ ప్రమాణాలు పాటించడం, చౌక విద్యుత్ పవర్ ఎక్ఛేంజీలతో విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా మొత్తం మీదæ రూ.2,342 కోట్లు ఆదా చేశారు. విద్యుత్ సంస్థల్లో సాంకేతిక, వాణిజ్య నష్టాలు 2018–19లో 13.79 శాతం ఉండగా 2019–20లో 10.95 శాతానికి తగ్గాయి. 2021–22 ఏప్రిల్, మే, జూన్ నెలల్లో విద్యుత్ కొనుగోళ్ల ద్వారా దాదాపు రూ.95 కోట్లు పొదుపు చేయగలిగారు. సగటున రోజుకు రూ.కోటి ఆదా చేశాయంటే దానికి కృత్రిమ మేధస్సు ప్రధాన కారణమని ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. గ్రిడ్ నిర్వహణలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. పవన, సౌర విద్యుత్‌లో ఆకస్మిక అంతరాయాలు వచ్చినప్పుడు మార్కెట్ నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తుంటుంది. ఈ సవాళ్లను అధిగమించడానికి, వాతావరణ డేటా, సెలవులు, కాలానుగుణ సమాచారం, వాతావరణ సూచన మొదలైన వాటితో సహా 25 సంవత్సరాల సమాచారాన్ని ఉపయోగించి దీనిని అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
పటిష్ట విద్యుత్ రంగ నిర్మాణంలో భాగంగా..
బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనడానికే ఎక్కువ ఖర్చవుతుంటుంది. దీనిని తగ్గించేందుకు మరుసటి రోజు విద్యుత్ డిమాండ్‌ను కచ్చితంగా అంచనా వేయడం అత్యంత కీలకం. ఏమాత్రం తేడా జరిగినా గ్రిడ్‌కు భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు విద్యుత్ కోతలు కూడా విధించాల్సి వస్తుంది. వినియోగదారులకు తక్కువ ఖర్చుతో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు పటిష్టమైన విద్యుత్ రంగాన్ని నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చాం. – నాగులాపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి
రాయితీలు పెంచాలి
మామిడితోటలకు బనగానపల్లె ప్రాంతం ప్రసిద్దే. చాలా కాలంగా తోటల పెంపకం ఖర్చు ఎక్కువగా అవుతోంది. రూ.లక్షల్లో భరించే స్థోమతులేక చాలామంది మామిడితోటల సాగు తగ్గించారు. రైతులకు ప్రభుత్వం ఎక్కువ రాయితీలు అందిస్తే తోటల పెంపకానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎంతోకాలంగా ఉన్న తోటలను తీసేయలేక ఇప్పటికీ పెంచుతున్నాం. –అబ్దుల్‌హమీద్, మామిడి రైతు, బనగానపల్లె
రుణ సౌకర్యం కల్పించాలి
ప్రతి రైతు తనకు ఉన్న పొలంలో కొంత పొలాన్ని మామిడి తోట పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రైతులకు వ్యవసాయంతో పాటు మామిడితోటల ద్వారా వచ్చే ఆదాయం లాభసాటిగా ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం పెద్దెత్తున రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బ్యాంకుల ద్వారా తోటల పెంపకానికి రుణ సౌకర్యం కూడా కల్పించాలి.
–జక్కా విజయకృష్ణకుమార్, మామిడి రైతు, ఇల్లూరుకొత్తపేట
Comments
Please login to add a commentAdd a comment