విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందిన శ్రీనివాస్ గౌడ్
సాక్షి, రంగారెడ్డి : సెల్‌ఫోన్ ఇప్పుడు మానవుడి జీవితంలో నిత్యావసర వస్తువు. మనిషి జీవితంలో మొబైల్ ఎంతలా అల్లుకుపోయిందంటే అది లేకుండా కనీసం ఐదు నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి. పొద్దున నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రలోకి జారుకునేంతగా తయారైంది. జేబులో డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ.. చేతిలో మొబైల్ లేకపోతే చాలా కష్టం అంటోంది నేటి సమాజం. ఫోన్ మాట్లాడుతూ వ్యవహారాలు నడిపే వారు కొందరైతే.. చెవిలో ఇయర్ ఫోన్స్‌తో పాటలు పెట్టుకొని ఆనందించే వారు మరి కొందరు. అలా పాటలు వింటూ పరలోకాలకు వెల్లిపోయాడు ఓ వ్యక్తి..
వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా సింగూరుకు చెందిన శ్రీనివాస్ పడుకునే ముందు ఫోన్ ఛార్జింగ్ పెట్టి పాటలు వింటూ నిద్రలోకి జారుకున్నాడు. తెల్లారి భర్త ఎంతకూ లేవకపోవడంతో ఆందోళన చెందిన భార్య చుట్టు పక్కల వారిని పిలుచుకు వచ్చింది. పలు సార్లు నిద్రలేపడానికి ప్రయత్నించిన చూసినా ఫలితం లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. ఆ రోజు రాత్రి కరెంటు వర్షం కారణంగా పలుసార్లు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడంది. వస్తుండడం, పోతుండటంతో విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల కారణంగా ఇయర్ ఫోన్స్ ద్వారా కరెంట్ షాక్‌కి గురై మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. మృతునికి భార్యా, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment