సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతూ..
పెద్ద అడిశర్లపల్లి : సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుం డగా విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పెద్దవూర మండలం పెద్దమ్మమ్మడంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెం దిన సాదు ఆంజనేయులు (26) తన ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా కేబుల్‌కు ఎర్త్‌రావడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామంలో రెండు, మూడు రోజులుగా ఇళ్లల్లో కరెంట్ షాక్ వస్తోందని, సిబ్బందికి తెలిపినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు.