విద్యుత్ ప్రమాదానికి కారణమైన విద్యుత్ తీగలు, సంఘటన స్థలంలో గుమికూడిన జనం
రాయచోటి రూరల్/టౌన్ : ఆ కుటుంబాన్ని దురదృష్టం వెంటాడింది. ఉన్న ఇద్దరు కొడుకులు చేతికి అంది వచ్చారనుకుంటున్న సమయంలో ఆరేళ్ల క్రితం పెద్ద కుమారుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మళ్లీ ఇప్పుడు గురువారం మరో కుమారుడు కూడా విద్యుదాఘాతంతోనే మృత్యువాత పడటంతో తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. చిన్నమండెం మండలం చాకిబండ గ్రామం అంపాబత్తునివారిపల్లెకు చెందిన అంపాబత్తుని రెడ్డెయ్య, రత్నమ్మలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె .
ఆరేళ్ల క్రితం స్వగ్రామంలో మొబైల్‌కు చార్జింగ్ పెడుతుండగా పెద్ద కుమారుడు శంకర కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రాయచోటి పట్టణంలో కర్నూలు– చిత్తూరు జాతీయ రహదారి పక్కనే ఉన్న సంగీత మొబైల్ షాపులో పనిచేస్తున్న వీరి చిన్న కుమారుడు రెడ్డి కిరణ్ గురువారం మధ్యాహ్నం తన షాపునకు సంబంధించిన బ్యానర్ కట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. అతని వెంట ఉన్న మరో యువకుడు విజయ్ తీవ్రంగా గాయపడ్డాడు.
నిలువెత్తు నిర్లక్ష్యం
రాయచోటి పట్టణ పరిధిలో ట్రాన్స్‌కో అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యంతో ఎక్కడ పడితే అక్కడ విద్యుత్ తీగలు వేలాడుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో పలుమార్లు కాలం చెల్లిన విద్యుత్ తీగలు నేలకూలిన సంధర్భాలు ఉన్నాయి. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ప్రజలు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment