Two sons
-
తిరిగి వచ్చినవాడు
మనం కూడా ధనానికి ప్రాముఖ్యతనిస్తున్నామా? ఆలోచించుకోవాలి. వస్తు, సంపదలకు ఇచ్చే ప్రాముఖ్యం మనం మనుషులకు ఇవ్వడం లేదు. ఇక్కడ ఆ తండ్రి ఆస్తికి ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. కుమారుడు ప్రాణాలతో తిరిగి రావడమే చాలా గొప్ప అనే ఆ తండ్రి ప్రేమ ఈ రోజు మనకు అనేక పాఠాలు నేర్పుతుంది. ఒక తండ్రికి ఇద్దరు కుమారులున్నారు. వారిలో చిన్నవాడు ఆస్తిలో తనకు వచ్చే భాగాన్ని తనకు ఇవ్వమని తండ్రిని అడిగాడు. తండ్రికి ఆస్తిని పంచడం ఇష్టం లేకున్నా పంచాడు. అయితే చిన్నవాడు కావడం వల్ల ఆ ఆస్తిని ఎలా వాడాలో తెలియని ఆ కుమారుడు తనకున్న సంపదని తీసుకుని ఆ ప్రాంతం నుండి వెళ్లిపోయి తన ఆస్తినంతటినీ చెడ్డ పనులు చేసి పోగొట్టుకున్నాడు. దాంతో చేసేదేం లేక ఆ దేశంలో పందులను మేపే పనిని చేస్తూ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకుంటూ ఎంతో వేదననుభవించాడు. చాలా బాధ పడ్డాక ఆ కుమారుడికి తన తండ్రి, తన ఇల్లు అన్నీ గుర్తుకొచ్చాయి. మళ్లీ తను అక్కడకు వెళితే బాగుంటుందనే ఆలోచన రావడంతోనే తిరిగి తన తండ్రి వద్దకు వెళ్లిపోయాడు. ఆ కుమారుడిని దూరం నుంచే చూసిన తండ్రి.. కుమారునికి ఎదురు వెళ్లి అతడిని ముద్దు పెట్టుకుని, తన దాసులతో కుమారుడు వచ్చాడని చెప్పి విందు చేయించాడు. అయితే ఆ తండ్రి వద్దనే ఉన్న పెద్ద కుమారుడికి తండ్రి చేస్తున్న ఆ పని నచ్చలేదు. ఆస్తి మొత్తాన్ని పోగొట్టి వచ్చిన వాడికోసం విందు చేసినందుకు అలిగాడు. అదే మాట తండ్రిని అడిగాడు. అందుకు ఆ తండ్రి ఇలా చెప్పాడు. (లూకా 15:32) ‘‘నీ తమ్ముడు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు. కనుక మనం ఆనందించాలి’’ అన్నాడు. తన పెద్ద కుమారుడికి దేనిని ప్రేమించాలో నేర్పాడు. – బెల్లంకొండ రవికాంత్ -
ఆ కుటుంబానికి ‘షాక్’
రాయచోటి రూరల్/టౌన్ : ఆ కుటుంబాన్ని దురదృష్టం వెంటాడింది. ఉన్న ఇద్దరు కొడుకులు చేతికి అంది వచ్చారనుకుంటున్న సమయంలో ఆరేళ్ల క్రితం పెద్ద కుమారుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మళ్లీ ఇప్పుడు గురువారం మరో కుమారుడు కూడా విద్యుదాఘాతంతోనే మృత్యువాత పడటంతో తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. చిన్నమండెం మండలం చాకిబండ గ్రామం అంపాబత్తునివారిపల్లెకు చెందిన అంపాబత్తుని రెడ్డెయ్య, రత్నమ్మలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె . ఆరేళ్ల క్రితం స్వగ్రామంలో మొబైల్‌కు చార్జింగ్ పెడుతుండగా పెద్ద కుమారుడు శంకర కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రాయచోటి పట్టణంలో కర్నూలు– చిత్తూరు జాతీయ రహదారి పక్కనే ఉన్న సంగీత మొబైల్ షాపులో పనిచేస్తున్న వీరి చిన్న కుమారుడు రెడ్డి కిరణ్ గురువారం మధ్యాహ్నం తన షాపునకు సంబంధించిన బ్యానర్ కట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. అతని వెంట ఉన్న మరో యువకుడు విజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. నిలువెత్తు నిర్లక్ష్యం రాయచోటి పట్టణ పరిధిలో ట్రాన్స్‌కో అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యంతో ఎక్కడ పడితే అక్కడ విద్యుత్ తీగలు వేలాడుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో పలుమార్లు కాలం చెల్లిన విద్యుత్ తీగలు నేలకూలిన సంధర్భాలు ఉన్నాయి. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ప్రజలు మండిపడుతున్నారు. -
తండ్రి చేతిలో ఇద్దరు కొడుకులు హతం
న్యూఢిల్లీ: మానసిక ఒత్తిడితో ఉన్న ఓ తండ్రి తన ఇద్దరు కుమారులను చంపిన దారుణ ఘటన బుధవారం దేశ రాజధానిలో చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఆయుష్(15), ఎనిమిదో తరగతి చదువుతున్న ఆర్యన్(13) తండ్రి చేతిలో హతమవ్వడం స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. సంజయ్‌నగర్‌లో నివాసముంటున్న ముఖేష్(43) భార్య గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందింది. ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్న ముఖేష్ గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడిలో కూరుకుపోయాడని మహేంద్ర పార్క్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఇద్దరు కుమారులను గొంతునులిమి హతమార్చాడు. అనంతరం తానే ఈ నేరానికి పాల్పడ్డానంటూ పోలీసులతో వెల్లడించాడు. ఇటీవల అతడి ఇంట్లో చేపట్టిన నూతన నిర్మాణంపై ఇరుగుపొరుగువారు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ముఖేష్ మరింత మనోవేదన చెంది ఉంటాడని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ముఖేష్‌ను అరెస్ట్ చేశారు. -
కన్నతల్లిని కొట్టి చంపిన తనయులు
నార్కట్‌పల్లి (నల్గొండ జిల్లా) : నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గద్దకూటిబావిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్నతల్లిని కొట్టి చంపారు తనయులు. గ్రామానికి చెందిన భోగిని పిచ్చమ్మ(48)అనే మహిళకు వెంకన్న, నరేష్ అనే ఇద్దరు కుమారులున్నారు. గురువారం గ్రామంలో బంధువుల ఇంట్లో దశ దిన కర్మ జరుగుతోంది. ఈ సందర్భంగా వారు విపరీతంగా మద్యం తాగారు. దీంతో తల్లి కుమారులను అతిగా తాగద్దని వారించింది. ఆగ్రహించిన కుమారులు తల్లిని విపరీతంగా కొట్టి పురుగుల మందు బలవంతంగా తాగించారు. అదే సమయంలో వారి భార్యలు అడ్డురాగా వారి కూడా విపరీతంగా కొట్టారు. ఈ సమయంలో పిచ్చమ్మ వారి నుంచి తప్పించుకుని వెళ్తుండగా మళ్లీ ఆమెను పట్టుకుని గదిలో బంధించారు. పరిస్థితి విషమించి పిచ్చమ్మ అక్కడ్నే ప్రాణాలు వదిలేసింది. ఈమేరకు గ్రామస్తులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పొలాల్లో దాక్కున్న నిందితులను స్టేషన్‌కు తరలించారు. నిందితుల భార్యల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తండ్రి చేతిలో తనయుల కిడ్నాప్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తన తండ్రి నుంచి డబ్బులు రాబట్టేందుకు తనయులనే కిడ్నాప్ చేసిన ఓ తండ్రి ఉదంతం చెన్నైలో గురువారం చోటుచేసుకుంది. అంబత్తూరు సమీపం కల్లికుప్పంకు చెందిన కిరణ్‌కుమార్ (39) చెన్నై చేట్పట్లోని కాల్సెంటర్లో పనిచేస్తున్నాడు. ఇతనికి వికాస్ (11), జయదీప్ (8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. స్కూలుకు వెళ్లేందుకు నిల్చుని ఉండగా వ్యాన్ రిపేరుకు గురైంది, అందుకే కారు పంపారు అంటూ ఇద్దరు వ్యక్తులు పిల్లలు ఇద్దరిని ఎక్కించుకున్నారు. మార్గమధ్యంలో మరో ఇద్దరు కారు ఎక్కారు. కిరణ్‌కుమార్‌కు వారు ఫోన్ చేసి రూ.30లక్షలు ఇస్తేనే వదిలిపెడతామని హెచ్చరించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కిడ్నాపర్లు పిల్లలను విడిచిపెట్టి పారిపోయారు. కిరణ్‌కుమార్‌కు రూ.30లక్షల వరకు అప్పు ఉందని, రిటైర్డు శాస్త్రవేత్తై తన తండ్రి వెంకటేశ్వర్లు వద్ద ఉన్న లక్షలాది రూపాయలతో అప్పు తీర్చుకోవచ్చని పథకం పన్ని కిరణ్‌కుమార్ స్నేహితులతో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీస్ విచారణలో తేలింది. కిరణ్‌కుమార్‌తోపాటు ఇద్దరు స్నేహితులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. -
చర్చిలోనే కొడుకును చంపేశారు!
ఇద్దరు టీనేజ్ సోదరులపై చర్చిలో పాశవిక దాడి జరిగింది. ఆరుగురు కలిసి.. పొత్తికడుపు, మర్మాయవాలు పూర్తిగా ఛిద్రమయ్యేలా వారిద్దరిని చితకబాదారు. చివరికి దాడిచేసినవాళ్లే ఆ యువకులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకునేలోపే పెద్దోడు చనిపోయాడు. చిన్నోడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన ఆరుగురిలో ఇద్దరు సాక్షాత్తు ఆ యువకుల తల్లిదండ్రులు! బాలీవుడ్ సినిమా మలుపులను తలపిస్తున్న ఈ ఘటనలో.. మృతుడి తల్లిదండ్రులు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ నగర శివారులోని న్యూ హార్ట్ ఫీల్డ్ ప్రాంతంలో నివసించే బ్రూస్ (65), దెబొరా (59)లకు ఇద్దరు కొడుకులు. పేర్లు లూకస్ (19), క్రిస్టోఫర్ (17) ఆ ప్రాంతంలో ఉండేవాళ్లంతా 'వర్డ్ ఆఫ్ లైఫ్' చర్చికి వెళతారు. గత సోమవారం అదే చర్చిలో లూకస్, క్రిస్టోఫర్ లపై అనూహ్యరీతిలో దాడి జరిగింది. తల్లి దండ్రులు బ్రూస్, దెబోరాలతోపాటు చర్చికి చెందిన జోసెఫ్, డేవిడ్, లిండా, సారా అనే మరో నలుగురు వ్యక్తులు సోదరులను తీవ్రంగా కొట్టి, కొద్దిసేపటి తర్వాత ఆసుపత్రిలో చేర్చారు. లూకస్ చనిపోగా, క్రిస్టోఫర్ చికిత్స పొందుతున్నాడు. అయితే.. ఎన్ని కోణాల్లో దర్యాప్తు చేసినప్పటికీ హత్యకు కారణం తెలియరాలేదు. దీంతో చర్చి సహా చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. మరింత లోతైన పరిశోధనలు మొదలుపెట్టారు. మరోవైపు ఒనెయిడా కంట్రీ జైలులో ఉన్న నిందితులనూ విచారించారు. లూకస్, క్రిస్టోఫర్ లు నిందితుల అసలు పిల్లలేనా? క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే చర్చిలోనే ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఘటన జరిగినప్పుడు చర్చిలో ఎవరెవరున్నారు? తదితర చిక్కుముడులను విప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు చోటుచేసుకునే అవకాశం ఉందని హార్ట్ ఫోర్ట్ పోలీస్ అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగానే నిందితులకు కోర్టులో బెయిల్ మంజూరైంది. ఒక్కొక్కరు లక్ష డాలర్ల పూచీకత్తు చెల్లించి జైలు నుంచి విముక్తి పొందొచ్చని కోర్టు పేర్కొంది. కానీ విడుదలయ్యేందుకు నిందితులు సిద్ధంగా లేరని వారి తరఫు న్యాయవాది తెలిపారు. మరి అలాంటప్పుడు బెయిల్ దరఖాస్తు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నిస్తే సమాధానం దాటవేశారు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ శుక్రవారం జరగనుంది. -
తండ్రిని హతమార్చిన కుమారులు
శంషాబాద్ (రంగారెడ్డి) : తండ్రిని కన్నకొడుకులే హతమార్చారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గండిగూడలో మహబూబ్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఫయీమ్(55) అనే వ్యక్తి తల్లి, ఇద్దరు కుమారులతో కలసి ఉంటున్నాడు. అయితే నెలరోజుల కిందట ఇద్దరు కుమారులు కలిసి తండ్రిని గొంతు నులిమి హతమార్చరు. అనంతరం మృతదేహాన్ని సంచిలో వేసి బావిలో పడవేశారు. అయితే ఈ విషయం మంగళవారం బయటపడటంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పట్టెడు అన్నం పెట్టలేక..
గుర్రంపోడు :అమ్మ ప్రాణం పోసి జీవమిస్తే.. ఆ ప్రాణానికి ఓ రూపునిచ్చే వ్యక్తి నాన్న. బతుకు సమరంలో వె న్నంటూ ఉంటూ భరోసానిచ్చే దైవం. అలాంటి నాన్న అనారోగ్యానికి గురైతే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమారులు కనికరం లేకుండా వీధినపడేశారు. ఆస్తిపాస్తులు పంచుకున్న వారికి నాన్న పోషన భారమై బతికుండానే కాటిక సమీపంలో పడవేసిన సంఘటన గుర్రంపోడు మండలం ఆమలూరు గ్రా మంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... ఆమలూరుకు చెందిన బొమ్ము మల్లయ్య కుటుంబం బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం నల్లగొండకు వలసవెళ్లింది. మల్లయ్యకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమారుడు కృష్ణయ్య తాపిమేస్త్రిగా, చిన్న కుమారుడు వెంకన్న ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గ్రామంలో ఉన్న 10 ఎకరాల భూమిని ఇద్దరు కుమారులకు పంచి ఇచ్చాడు. ఇల్లు కూలిపోయింది. భార్య 15ఏళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోవడంతో నల్లగొండలో కొడుకుల వద్దే ఉంటూ ప్రైవేట్ సంస్థల్లో కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమం లో రెండేళ్ల క్రితం మల్లయ్య కాలికి గాయం కావడం, అప్పటికే షుగర్ వ్యాధి ఉండడం, మానసిక స్థితిలోపించి మంచానపడ్డాడు. దీంతో తండ్రిని పోషించే విషయంలో ఇద్దరు కుమారుల మధ్య గొడవ మొదలైంది. ఏడాదిగా తండ్రికి వైద్యం అందిస్తూ పోషిస్తున్న చిన్న కుమారుడు వెంకన్న తండ్రిని తీసుకవెళ్లమని తన సోదరుడు కృష్ణయ్యకు ఇటీవల చెప్పాడు. కానీ తాను పో షించలేనని పేర్కొనడంతో వెంకన్న శుక్రవారం మల్లయ్యను ఆమలూరుకు తీసుకువచ్చి గ్రామ శివారులో శ్మశానానికి ఆనుకుని ఉన్న సొంత భూమిలో గుడారం వేసి అందులో ఉంచి కులపెద్దలను ఆశ్రయించాడు. ఆదివారం పెద్ద కుమారుడు కృష్ణయ్యను ఫోన్లో సంప్రదించగా తండ్రితో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నట్లు గ్రామస్తులు, కులపెద్దలు తెలిపా రు. దీంతో చేసేదేమిలేక తిండి తిప్పలు లేక పస్తులుం టున్న బొమ్ము మల్లయ్యకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
అమ్మను ‘చంపేశారు’
నవమాసాలు మోసి కని, పెంచిన తల్లి ఆ కొడుకులిద్దరికీ భారమైంది. ఆమె ఆస్తిని పంచుకున్న అన్నదమ్ములు బాగోగులు చూడడం మరిచారు. బుక్కెడన్నం కూడా పెట్టకుండా ఇబ్బంది పెట్టారు. వృద్ధాప్యంలో వండుకుని తినే ఓపిక లేని ఆమె పలుమార్లు అస్వస్థతకు గురై శనివారం రాత్రి ఈ లోకాన్ని విడిచివెళ్లింది. రామగుండం, న్యూస్‌లైన్ : రామగుండం పాతబజార్‌కు చెం దిన గద్ద రత్నయ్య- రుక్కమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. రత్నయ్య సింగరేణిలో ఉద్యోగ విరమణ చేసి కొంతకాలం క్రితం చనిపోయాడు. ఇద్దరు కుమారులు రాజన్న, శ్రీనివాస్(ప్రభుత్వ ఉపాధ్యాయుడు) ఆస్తిని పం చుకుని తల్లిని ఒంటరిగా వదిలి వెళ్లారు. ఇంట్లో ఉన్న ఆమెను ఒక్కదానికి పెద్ద ఇల్లు ఎందుకని చెప్పి బయటకు పంపా రు. ఓ రేకులషెడ్డు వేసిచ్చి, ఇంటిని అద్దెకిచ్చారు. వచ్చిన డబ్బులను కలిసి పం చుకుంటున్నారు. కానీ తల్లి బాగోగులు చూడడం మరిచారు. వృద్ధాప్యంలో సత్తువ లేకుండా ఉన్న ఆమెకు ఇరుగుపొరుగు వారు అన్నం పెడుతున్నారు. పలుమార్లు అస్వస్థతకు గురైనా వారే ది క్కయ్యారు. ఇటీవల రుక్కమ్మ(70)కు జ్వరం రావడం, ఆరోగ్య పరిస్థితి మరిం త దిగజారడంతో స్థానికులు కుమారులకు సమాచారం ఇచ్చారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోలీ సులకు చెప్పారు. తబితా ఆశ్రమ నిర్వాహకుడు వీరేందర్ ఆగస్టు 20న ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఎస్సై అక్కడకు కు మారులను పిలిచి మందలించారు. తల్లి వెంట ఉండి మెరుగైన వైద్యం చేయించాలని చెప్పారు. రెండురోజులపాటు చికి త్స చేయించిన వారు ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి రుక ్కమ్మ అస్వస్థతతో కన్నుమూసింది. కుమారులపై కేసు.. కొడుకులు ఆదరించకపోవడంతోనే రుక్కమ్మ చనిపోయిందని, తమ విచారణలో ఈ విషయం వెల్లడైందని ఎస్సై శ్రీను తెలిపారు. వారిపై మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్-2007, సెక్షన్-24 కింద కేసు నమోదు చేశామని, త్వరలోనే వారిద్దరిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.