న్యూఢిల్లీ: మానసిక ఒత్తిడితో ఉన్న ఓ తండ్రి తన ఇద్దరు కుమారులను చంపిన దారుణ ఘటన బుధవారం దేశ రాజధానిలో చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఆయుష్(15), ఎనిమిదో తరగతి చదువుతున్న ఆర్యన్(13) తండ్రి చేతిలో హతమవ‍్వడం స్థానికంగా కలకలం రేపింది.
వివరాలు.. సంజయ్‌నగర్‌లో నివాసముంటున్న ముఖేష్(43) భార్య గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందింది. ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్న ముఖేష్ గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడిలో కూరుకుపోయాడని మహేంద్ర పార్క్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఇద్దరు కుమారులను గొంతునులిమి హతమార్చాడు. అనంతరం తానే ఈ నేరానికి పాల్పడ్డానంటూ పోలీసులతో వెల్లడించాడు. ఇటీవల అతడి ఇంట్లో చేపట్టిన నూతన నిర్మాణంపై ఇరుగుపొరుగువారు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ముఖేష్ మరింత మనోవేదన చెంది ఉంటాడని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ముఖేష్‌ను అరెస్ట్ చేశారు.
తండ్రి చేతిలో ఇద్దరు కొడుకులు హతం
Published Wed, Nov 16 2016 5:32 PM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM
Advertisement
Advertisement