సాక్షి ప్రతినిధి, చెన్నై: తన తండ్రి నుంచి డబ్బులు రాబట్టేందుకు తనయులనే కిడ్నాప్ చేసిన ఓ తండ్రి ఉదంతం చెన్నైలో గురువారం చోటుచేసుకుంది. అంబత్తూరు సమీపం కల్లికుప్పంకు చెందిన కిరణ్‌కుమార్ (39) చెన్నై చేట్‌పట్‌లోని కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్నాడు. ఇతనికి వికాస్ (11), జయదీప్ (8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. స్కూలుకు వెళ్లేందుకు నిల్చుని ఉండగా వ్యాన్ రిపేరుకు గురైంది, అందుకే కారు పంపారు అంటూ ఇద్దరు వ్యక్తులు పిల్లలు ఇద్దరిని ఎక్కించుకున్నారు.
మార్గమధ్యంలో మరో ఇద్దరు కారు ఎక్కారు. కిరణ్‌కుమార్‌కు వారు ఫోన్ చేసి రూ.30లక్షలు ఇస్తేనే వదిలిపెడతామని హెచ్చరించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కిడ్నాపర్లు పిల్లలను విడిచిపెట్టి పారిపోయారు. కిరణ్‌కుమార్‌కు రూ.30లక్షల వరకు అప్పు ఉందని, రిటైర్డు శాస్త్రవేత్తై తన తండ్రి వెంకటేశ్వర్లు వద్ద ఉన్న లక్షలాది రూపాయలతో అప్పు తీర్చుకోవచ్చని పథకం పన్ని కిరణ్‌కుమార్ స్నేహితులతో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీస్ విచారణలో తేలింది. కిరణ్‌కుమార్‌తోపాటు ఇద్దరు స్నేహితులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
తండ్రి చేతిలో తనయుల కిడ్నాప్
Published Sat, Jun 25 2016 2:29 AM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM
Advertisement